ఏపీకి తప్పిన సిత్రాంగ్ తుఫాను ముప్పు: జోరు వానలు, మత్య్సకారులకు వార్నింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను తుఫాను నుంచి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, వర్షాలు మాత్రం కుండపోతగా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ తుఫానుకు సిత్రాంగ్ అని నామకరణం చేసింది. సిత్రాంగ్ తుఫాను మంగళవారం తెల్లవారుజామున తీవ్రమై తూర్పు బంగ్లాదేశ్ తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఒడిశా, విదర్భా మీదుగా క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని వెల్లడించింది.

No effect of sitrang cyclone on andhra Pradesh: few days rain in the state

కాగా, ఏపీకి సిత్రాంగ్ తుఫాను ముప్పు లేదని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 22 నుంచి 28 వరకు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాల వల్ల నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సిత్రాంగ్ తుఫాను నేపథ్యంలో ఇప్పటికే ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంపైకి మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. సిత్రాంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగా పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని.. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+