అన్న క్యాంటీన్‌లో వారికి నో ఎంట్రీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది.చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు. కడుపునిండా భోజనం చేయవచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటిన్లు ఆకలి తీర్చుతున్నాయి.
కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటిన్ కు బారులు తీరుతున్నారు.ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు.5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు. రూ.5కే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటివారితో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్న క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.అందులో ఏం రాసారంటే మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టము..అని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫుల్లుగా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండటం..నానా రచ్చ చేస్తుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్ళు హోటల్‌కే వెళ్ళి తినాలని, పేదల కోసం 5 రూపాయలకే అన్నం పెడుతుంటే దీన్ని కూడా దుర్వినియోగం చేయడం మంచి పద్దతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications