• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కీలక నిర్ణయం: హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయొద్దు.. బాబు ఆదేశం

|

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుంటే పెట్రోల్ పోయకూడదని ఏపీ సర్కార్ బుధవారం ఆదేశించింది.

బైక్ పైన వచ్చే వారు హెల్మెట్ లేకుండా ఉంటే, కారులో ఉచ్చే వారు సీటు బెల్టు పెట్టుకోకుండా ఉంటే పెట్రోల్, డీజిల్ పోయవద్దని ఏపీ సర్కార్ అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది.

రోడ్డు ప్రమాదాలు నివారించడంలో అలసత్వంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం వినియోగించే పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

No helmet, no petrol rule proposed in Andhra Pradesh

సమావేశంలో ముఖ్య విషయాలు

- రవాణా వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు 'ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూసే మనుషులున్నారు జాగ్రత్త' అని బయలుదేరే సమయలో చెప్పాలి. యజమాని చెప్పిన మాట చాలా ప్రభావం చూపుతుంది.

- నియమాలు కఠినంగా ఉన్నా తప్పని సరిగా అమలు చేస్తేనే ప్రమాదాలు నివారించగలం.

- పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారితనం మరింత పెరగాలి.

- రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై గుర్తించిన బ్లాక్ జోన్స్‌లో అసలు ఇబ్బంది ఏమిటో సత్వరమే గుర్తించి సరిచేయాలి. దీనిపై జాతీయ రహదారులు, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను సత్వరం పరిష్కరించాలని ఆదేశాలు.

- ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలి.

- రహదారి భద్రత పట్ల ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి.

- నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు తీసుకుంటా.

- ఎక్కువ శాతం రోడ్డు కాపలా లేని కూడళ్లలో జరుగుతున్నాయి. అలాంటి చోట తక్షణమే కాపలా ఏర్పాటు చేయాలి.

- పట్టణ ప్రాంతాల్లో, జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించండి.

- అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ వినియోగించుకోవాలి.

- వారంలో ఒకరోజు తప్పనిసరిగా తనిఖీలు చేయండి. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి.

- మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన శిక్షలు.

- అత్యదిక ప్రమాదాలు ద్విచక్రవాహనాల ప్రయాణాల్లోనే జరుగుతున్నాయి.

- ద్విచక్రవాహన, కారు ప్రమాదాలలో మరణాలకి కారణం హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లనే. వీటిపై ప్రజలలో కూడా మార్పు రావాలి.

- హెల్మెట్ ధరించడం ప్రభుత్వం కోసం కాదు, పోలీసులు పట్ట్టుకుంటారనే భయంతో కాదు. ప్రాణరక్షణకనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

- 15 నుంచి 34 వయసు మధ్యలో వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం అత్యంత బాధాకరం. యువత దీనిపై సీరియస్‌గా ఆలోచించాలి.

- విద్యార్దులే ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అందుకు కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టి అక్కడికక్కడే లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేలా ప్రత్యెక కార్యక్రమం చేపట్టామని, ఒక్క విద్యార్థి కూడా లైసెన్స్ లేకుండా వాహనం నడపకుండా ఉండాలని పని పని చేస్తున్నామని రవాణా శాఖ అధికారులు చెప్పారు.

- అన్ని స్కూల్ బస్సులకు, ఇతర పాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి చేయాలి.

- రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జిపీయస్ అమర్చే అంశాన్ని పరిశీలించండి. జిపీయస్ వల్ల వాహనదారులకు కలిగే ప్రయోజనాలను వివరించాలి.

- ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు వంటి అవసరమైన సమాచారం లభించేలా ఒక ప్రత్యెక యాప్ తయారు చేయడం.

- భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.

- పోలిస్, రవాణ శాఖలు సంయుక్తంగా పని చేయడం వల్లే ఇది సాద్యం అయింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ బాధ్యత ఒక్క శాఖది మాత్రమే కాదు. జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

- భద్రతా నియమాలు సమర్ధంగా అమలు చేయడంవల్ల విశాఖ, కర్నూల్, కృష్ణా జిల్లాలలో ప్రమాద మరణాల సంఖ్య తగ్గింది.

- ఈ జిల్లాలో చేపట్టిన ఉత్తమ పద్దతులు మిగతా జిల్లాలకు తెలియజెప్పాలి.

- రహదారి భద్రత అత్యంత ముఖ్యమైన అంశం.ఏ అధికారి అయినా సరిగా పనిచేయట్లేదని తేలితే వెంటనే తొలగించడానికి కూడా వెనుకాడవద్దు.

- ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రమాద సమయంలో సాయపడే వాళ్లకి పోలీసులు ఇబ్బందులు కలిగించరన్న విషయం తెలియజేయండి. సాటివారికి సాయపడటం ప్రతిఒక్కరూ అలవాటు చేసుకోవాలి.

- ప్రమాదాల్లో వెన్నుముక దెబ్బతిని శాశ్వత వైకల్యం పొందిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి.

- రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వంటి వాహనాలన్నీ జియో ట్యాగింగ్ చేయండి. ప్రమాద సమాచారం దగ్గరలో ఉన్న అన్ని వాహనాలకు అందేలా ఏర్పాట్లు చేయాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh government ordered ‘No helmet, No petrol’ rule in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more