మానవత్వాన్ని మంటగలిపారు: స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో భర్తను ఈడ్చుకెళ్ళిన భార్య

గుంతకల్లు:మాయమౌతున్నాడమ్మా...మనిషన్నవాడు....మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అంటూ అందెశ్రీ రాసిన పాట ఈనాటి పరిస్థితులకు అద్దంపడుతోంది. అనంతపురం జిల్లాలోని ఆసుపత్రిలో చోటుచేసుకొన్న ఘటనను చూస్తే ఈ పాట సరిగ్గా సరిపోతోంది. మానవత్వం లేకుండా ఆసుపత్రి సిబ్బంది వ్యవహారించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

మారుతున్న పరిస్థితులతో మనిషిలో మానవత్వం, జాలి, కరుణ లాంటి పదాలకు పద్దతులకు దూరమౌతున్నాడు.లేవలేని పరిస్థితుల్లో ఉన్న రోగికి కనీసం స్ట్రెచర్ ఇచ్చేందుకు కూడ ఆసుపత్రి సిబ్బంది ముందుకు రాని దుస్థితి అనంతపురం జిల్లా గుంతకల్లు ఆసుపత్రిలో చోటుచేసుకొంది.

no humanity in guntakal hospital

గుంతకల్లుకు చెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరోచనాలతో ఆయన ఇబ్బందిపడుతున్నాడు. ఆయన సతీమణి శ్రీనివాసాచారిని ఆసుపత్రికి తీసుకువచ్చింది.

కాలికి గాయంతో పాటు నడవలేని పరిస్థితిలో ఉన్న శ్రీనివాసాచారిని ఆసుపత్రిలోపలికి తీసుకెళ్ళేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కోరింది. వారు ససేమిరా అన్నారు. పలుమార్లు ప్రాధేయపడింది. ఇక చేసేదిలేక భర్తను కింద పడుకోబెట్టి లాక్కెళ్ళి సర్జికల్ వార్డులో చేర్చింది.ఈ విషయం తెలుసుకొన్న ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. భాద్యులపై చర్యలు తీసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+