వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, టీ ఎంపీల ప్రశ్న: నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపై తేల్చేసిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ సమాధానం ఇచ్చారు.

2019లోగా అసెంబ్లీ సీట్లను పెంచాలంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించడం ఒక్కటే మార్గమని, అది కుదరదని వెల్లడించారు. 2026లో అప్పటి జనాభా లెక్కల ఆధారంగానే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.

No increase of Assembly seats in Telangana, Andhra Pradesh: Centre

అంతేగానీ, ఈలోగా నియోజకవర్గాల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. దీంతో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లయింది. కాగా, నియోజకవర్గాల పునర్ విభజనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

English summary
The Centre on Tuesday told the parliament that it was not going to increase the number of Assembly seats in the two Telugu states before 2026.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X