వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరె మామా.. జగన్ ఇలాకల స్వతంత్రులే లేరు..! రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదే ఫస్టు కాకా..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక్క స్వతంత్ర శాసనసభ్యుడు కూడా లేని శాసనసభ తొలిసారి కొలువుదీరనుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రతి సభలోనూ స్వతంత్ర సభ్యులున్నారు. 2014లోనూ పిఠాపురం నుంచి వర్మ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్‌ నవోదయం పార్టీ తరపున గెలిచారు. ఈసారి వైసీపీ 151చోట్ల, టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి.

దీంతో ఒక్క స్వతంత్రుడూ లేని తొలిసభగా రికార్డు నమోదు కానుంది. 1957 తొలి ఎన్నికల్లో 12మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ 1983 ఎన్నికల్లో 18 మంది గెలుపొందారు. 1967 ఎన్నికల్లో అత్యధికంగా 68 మంది విజయం సాధించారు. 1972లో 56 మంది గెలిచారు. ఇక వివిద సందర్బాల్లో స్వతంత్రుల విజయాలను ఒక సారి చూద్దాం.

no independent in jagans government.!First time in the assembly history..!!

1957లో 12 మంది, 1962లో 46, 1967లో 68, 1972లో 56, 1978లో 15, 1983లో 18, 1985లో 8, 1989లో 14, 1994లో 12, 1999లో 5, 2004లో 11, 2009లో 3, 2014లో ఒక్కు గెలవగా., 2019లో ఏ ఒక్క స్వతంత్ర అభ్యర్థికూడా గెలవలేదు. దీంతో జగన్ ప్రభుత్వంలో స్వతంత్ర్య అభ్యర్థి లేక పోవడం ఇదే ప్రథమం. ఇది కూడా శాసనసభ చరిత్రలో ఓ రికార్డు కానుంది.

English summary
In the history of Andhra Pradesh, the legislature that does not have a single legislator is the first time. Each member has independent members from the statehood.The record is going to be the first no independent one in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X