షాక్, అడిగితేనే: రాష్ట్రాల గొడవలో జోక్యం చేసుకోమన్న వెంకయ్య

న్యూఢిల్లీ: రాష్ట్రాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 పైన రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదిస్తే పరిశీలిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తాము ఎవరి పట్ల వివక్ష చూపించమన్నారు.

వంద స్మార్ట్ సిటీలు, 500 అమృత నగరాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించే కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభిస్తారని చెప్పారు. పట్టణ జనాభా ఆధారంగా స్మార్ట్ సిటీలను ఎంపిక చేశామన్నారు. పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపడతామన్నారు.

ఎమర్జెన్సీ పైన స్పందిస్తూ.. దేశంలో అత్యయిక స్థితి చరిత్రలోనే చీకటి దినం అన్నారు. 40 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ తన జీవిత గమనాన్ని మార్చివేసిందన్నారు. ఆనాటి అరాచకాలను యువతకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.

Venkaiah Naidu

కాగా, హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అదంతా ఊహాగానాలేనని టీఆర్ఎశ్ నేతలు కొట్టి పారేస్తున్నారు. మరోవైపు, సెక్షన్ 8 గవర్నర్ కోర్టులోనే ఉందని చెబుతున్నారు.

బెంగళూరుకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కర్నాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. స్వచ్చ భారత్ పైన జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+