కర్నూల్లో ఎలా, మా వూళ్లో పెట్టొచ్చు!: రాజధానిపై బాబు
హైదరాబాద్: రాజధాని నాయకుడి ఇష్టం కాదని, ప్రజలకు సౌకర్యంగా ఉండేచోట నిర్ణయిస్తామని, ముందుగా అనుకున్న చోటనే ఏర్పాటవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబును బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.
కొత్త రాజధాని పైన రోజుకో పేరు తెర పైకి వస్తుందని, ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాని పైన ప్రభుత్వం తేల్చుకోలేకపోతోందా అని సీపీఐ నేతలు అడిగారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. గందరగోళమేం లేదని, ముందు నుండి అనుకున్నచోటనే రాజధాని ఏర్పాటవుతుందని, కర్నూలులో పెట్టాలని కొందరు అంటున్నారని, అక్కడ ఎలా సాధ్యమవుతుందన్నారు.

రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలన్నారు. నాయకుడి ఇష్ట ప్రకారమైతే తిరుపతి సమీపంలో ఏర్పాటు చేస్తే మా ఊరిలో పెట్టినట్లవుతుందన్నారు. అలా చేయడం సమంజసం కాదు కదా అన్నారు. రాజధాని నగరం నాయకుడి ఇష్టప్రకారం నిర్ణయించేది కాదన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.
ఏపీ కొత్త రాజధానిలో నల్సార్
నల్సార్ తరహా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర కొత్తరాజధానిలో నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ (నల్సార్) ఏర్పాటుకు ఏపీ సర్కార్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ న్యాయశాస్త్ర అధ్యయనం, పరిశోధన కోసం జాతీయ సంస్థ ఏర్పాటు కావాలన్న సుప్రీం కోర్టు కమిటీ సిఫారసులను అనుసరించి లీగల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో వివరించింది. ఏపీ కొత్తరాజధానిలో ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిసా్ట్రర్‌కు తెలియచేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications