ఆనం సోదరుల పార్టీ మార్పును తేలిగ్గా కొట్టేసిన రఘువీరా
ఒంగోలు: ఆనం సోదరులు తమ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తేలిగ్గా కొట్టేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారుతున్న విషయంపై ఆయన పరోక్షంగా స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఆయన అన్నారు.
ఎవరు పార్టీని వీడినా తమ పార్టీకి నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రమైన భైరవకోనలో ఆయన సోమవారం మట్టి సత్యాగ్రహం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగే విధంగా లక్ష ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి పంపుతామని ఆయన చెప్పారు.

భైరవకోనలో జరిగిన మట్టి సత్యాగ్రహంలో ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు ఉగ్రనరసింహా రెడ్డితో పాటు పలువురు కాంగ్రెసు నాయకులు పాల్గొన్నారు.
తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆనం సోదరులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆనం వివేకానంద రెడ్డిని చేర్చుకోవడంపై తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు సమాచారం. అయితే, ఆనం సోదరులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications