వైయస్ అవినీతి, పీఆర్పీ విలీనం, పోలవరం: నీలో విషయం లేదని పవన్‌పై జగన్ ఎదురుదాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. తనపై, తన తండ్రిపై చేసిన విమర్శలకు ఆయన ధీటుగా స్పందించారు. పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

పుట్టగానే ఎవరూ ముఖ్యమంత్రులు కారని, ప్రభుత్వంతో పని చేయించడమే అసలైన రాజకీయం అని, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ఊపిరి ఆడకుండా చేయాలని, సీఎం కావడమే లక్ష్యం కాదని, వైయస్ హయాంలో అవినీతి కూడా ఉందని పవన్ కళ్యాణ్.. జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ఘాటుగా స్పందించారు.

చదవండి: చిరంజీవిలా మంచోడ్నికాదు, అల్లు అరవింద్ నన్ను అలా చూశారు, ఏంచేయలేకపోయా: పవన్ సంచలనం

  Pawan Kalyan Speech over Chiranjeevi's CM post

  చదవండి: చిరంజీవి నోరులేనివాడు, నేనే ఉండి ఉంటే, నీ భార్యను కేబినెట్లో కూర్చోబెట్టావ్: పరకాలపై పవన్

   వైయస్‌ది అవినీతి పాలన ఐతే పీఆర్పీని ఎలా విలీనం చేశారు

  వైయస్‌ది అవినీతి పాలన ఐతే పీఆర్పీని ఎలా విలీనం చేశారు

  వైయస్ రాజశేఖర రెడ్డి హయాంకు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ఆయన గురించి ఏం తెలుసునని, ఆయన హయాంలో అవినీతిని ఏం చూశారని జగన్ నిలదీశారు. వైయస్‌ది అవినీతి పాలన అయితే తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేశారో చెప్పాలని నిలదీశారు.

   ఏ అనుభవంతో చిరు పార్టీ పెట్టారు, పవన్ యువరాజ్యం చీఫ్ అయ్యార

  ఏ అనుభవంతో చిరు పార్టీ పెట్టారు, పవన్ యువరాజ్యం చీఫ్ అయ్యార

  అలాగే, రాష్ట్రాన్ని పాలించడానికి పదేపదే అనుభవం అని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏ అనుభవం ఉందని చిరంజీవి 2009 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రజారాజ్యం పార్టీని పెట్టారో చెప్పాలని అడిగారు. అలాగే, ఏ అనుభవం ఉందని పవన్ యువరాజ్యం అధ్యక్షుడు అయ్యారని ప్రశ్నించారు.

  పోలవరంపై చంద్రబాబును ప్రశ్నించలేదేం

  పోలవరంపై చంద్రబాబును ప్రశ్నించలేదేం

  పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని జగన్ నిలదీశారు. మొదటి నుంచి మేమే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడుగుతున్నారన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు విషయంలో పవన్ కళ్యాణ్.. చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు.

  మా బస్సు యాత్రను చూసే పవన్ పోలవరం యాత్ర

  మా బస్సు యాత్రను చూసే పవన్ పోలవరం యాత్ర

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బస్సు యాత్రను చూసే పవన్ కళ్యాణ్ పోలవరం యాత్ర చేశారని జగన్ విమర్శించారు. లేదంటే ఆయన రాకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.

   డీసీఐ ఉద్యోగులపై

  డీసీఐ ఉద్యోగులపై

  డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) ఉద్యోగాల సమస్యపై తొలుత స్పందించింది తామేనని జగన్ తెలిపారు. తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి దీనిని పార్లమెంటులో లేవనెత్తారని చెప్పారు. పవన్‌ది కేవలం రెండు మూడు రోజుల హడావుడేనని, విషయం లేదన్నారు.

  చదవండి: అవసరం లేదు, ఈయనిలా జగన్ అలా: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, ఏపీపై ఎల్‌జీ ఆసక్తి

  చదవండి: తోలుమందంపై విష్ణు సెటైర్, మేమూ సమాధానం చెప్తాం: పవన్ కళ్యాణ్‌కు పురంధేశ్వరి

  చదవండి: మీపై నాకు అనుమానం వస్తోంది, తప్పు చేయకుంటే లెక్క చెప్పొచ్చుగా: బాబుకు పవన్ కళ్యాణ్ షాక్

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thursday responded on Jana Sena party cheif Pawan Kalyan's comments.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి