తోలుమందంపై విష్ణు సెటైర్, మేమూ సమాధానం చెప్తాం: పవన్ కళ్యాణ్‌కు పురంధేశ్వరి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖపట్నం డీసీఐ ఉద్యోగులు, కంపెనీ విషయంలో బీజేపీపై, ఆ పార్టీ నాయకులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు కమలం పార్టీ నేతలు పురంధేశ్వరి, ఎంపీ కంభంపాటి హరిబాబు, బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సై

  Purandeswari responded on alliance with Jana Sena పవన్ కళ్యాణ్ కోర్టులోకి | Oneindia Telugu

  బీజేపీ నేతలక తోలు మందం అయిపోయింది అన్న పవన్ వ్యాఖ్యలకు విష్ణు సెటైర్లు వేశారు. తోలు మందం అయిపోయిందా.. నన్ను చూసి అలా అన్నారేమో, లావు అయ్యాను, ఆయన (పవన్) సన్నగా ఉంటారు, ఆయన చర్మం పలచగా ఉంటుందని విష్ణు అన్నారు. తాను లావుగా ఉంటానని, అసెంబ్లీలో తన సీటు మొదట్లో ఉంటుందని, కెమెరా అతను కూడా తనను లావుగా చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

  పోలవరంలో చంద్రబాబు దుమ్ముదులిపిన పవన్ కళ్యాణ్

   పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి

  పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి

  పవన్ కళ్యాణ్ తమ శ్రేయోభిలాషి అని తాను భావిస్తున్నామని విష్ణు కుమార్ రాజు అన్నారు. డీసీఐ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.

   మీలాంటి వారు చెబితే మేం సమాధానం చెప్తాం

  మీలాంటి వారు చెబితే మేం సమాధానం చెప్తాం

  బీజేపీపై చేసిన విమర్శలపై పురంధేశ్వరి మాట్లాడుతూ.. అది ఆయన (పవన్) మనోభావం అని, బీజేపీ ఎక్కడ ప్రజలకు సహకరించలేదో, ఎక్కడ సంక్షేమానికి పెద్ద పీట వేయలేదో చెబితే బాగుంటుందన్నారు. అప్పుడు వారి అనుమానాలను కూడా తాము నివృత్తి చేస్తామన్నారు. మీలాంటి వారు చెబితే మేం కూడా సమాధానం చెబుతామని పవన్‌కు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు.

  నాకంటే సమస్య పట్టించుకుంటే సంతోషం

  నాకంటే సమస్య పట్టించుకుంటే సంతోషం

  డీసీఐ సమస్య పరిష్కారానికి హరిబాబు ముందుకు రావడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై హరిబాబు స్పందించారు. తాను 42 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశానని చెప్పారు. నేను సమస్యలు పట్టించుకోలేదని చెబితే, తనకంటే సమస్యను బాగా పట్టించుకునే వాళ్లు ఉంటే సంతోషిస్తానని చెప్పారు.

  నేను గెలుస్తా, ఓడిపోతానని చెప్పడం లేదు

  నేను గెలుస్తా, ఓడిపోతానని చెప్పడం లేదు

  ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుస్తారని, వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానని, లేదా ఓడిపోతానని చెప్పడం లేదని హరిబాబు అన్నారు. ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు. మేం సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలే ఓడిస్తారని కౌంటర్ ఇచ్చారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP leaders Purandeswari, Vishnu Kumar Raju and Hari Babu counter to Jana Sena chief Pawan Kalyan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి