Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పరకాలా! చిరు నోరులేనివాడు, ఆ రోజు నేనే ఉండిఉంటే, భార్యను కూర్చోబెట్టావ్: పవన్, జగన్‌పైనా

Recommended Video

    Pawan Kalyan Speech over Chiranjeevi's CM post

    రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌పై నిప్పులు చెరిగారు.

    అంతకుముందు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టును రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ఉందని చెప్పారు. అనంతరం ఆయన రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో మాట్లాడారు.

    చిరంజీవికి ఆ తపన ఉండేది, పీఆర్పీలో నిస్వార్థ నాయకులు ఉండి ఉంటే

    చిరంజీవికి ఆ తపన ఉండేది, పీఆర్పీలో నిస్వార్థ నాయకులు ఉండి ఉంటే

    ప్రజలకు మంచి చేయాలనే తపన తన సోదరుడు చిరంజీవికి ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీలో నిస్వార్థ నాయకులు ఉండి ఉంటే ఇప్పుడు అధికారంలో ఉండేదని అన్నారు. ప్రజారాజ్యం నుంచి నేర్చుకున్న వాటితో జనసేనను స్థాపించానని చెప్పారు.

    పరకాల ప్రభాకర్, నిర్మలాలపై విమర్శలు, చిరు నోరు లేని వ్యక్తి

    పరకాల ప్రభాకర్, నిర్మలాలపై విమర్శలు, చిరు నోరు లేని వ్యక్తి

    పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్‌లు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల తిట్టేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఆ సమయంలో తాను ఉండి ఉంటే సందర్భం మరోలా ఉండేదన్నారు. పరకాల వంటి నిబద్దత లేని వ్యక్తులు జనసేనకు అవసరం లేదన్నారు.

    నీ భార్యను కేబినెట్లో కూర్చోబెట్టావు

    నీ భార్యను కేబినెట్లో కూర్చోబెట్టావు

    నాడు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని పరకాల తిట్టారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీపై పడగవిప్పిన పరకాల ప్రభాకర్ ఇప్పుడు మాట్లాడటం లేదేమిటని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా దాని గురించి మాట్లాడని పరకాల ప్రభాకర్, తన సతీమణిని మాత్రం కేంద్ర కేబినెట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. ప్రజారాజ్యంలో నిస్వార్థపరులు లేక నష్టపోయిందని, లేదంటే అప్పుడే చిరంజీవి సీఎంగా ఉండేవారన్నారు.

    ఆవేశంతో రాలేదు, దెబ్బలు తినేందుకు సిద్ధం, అమ్ముడుపోను

    ఆవేశంతో రాలేదు, దెబ్బలు తినేందుకు సిద్ధం, అమ్ముడుపోను

    తాను విధివిధానాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేదని పవన్ తేల్చి చెప్పారు. ఆవేశంతో లేదా ఆకతాయితనంతో తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, కానీ రాజకీయంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పారు.

    వందల కోట్లు ఇచ్చేవాళ్లున్నారు కానీ తీసుకోను

    వందల కోట్లు ఇచ్చేవాళ్లున్నారు కానీ తీసుకోను

    తనకు వందల కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్లు లేరని, ఉన్నా తాను తీసుకోవనని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన వృత్తి సినిమాలు అని, ప్రవృత్తి రాజకీయం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా అద్భుతాలు చేయవచ్చునని, ఎన్నో పనులు చేయవచ్చునని చెప్పారు.

    హోదాపై మాట్లాడేందుకు నేను చిన్నవాడిని

    హోదాపై మాట్లాడేందుకు నేను చిన్నవాడిని

    ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు తాను చాలా చిన్నవాడిని అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన కంటే అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో అధికార పార్టీకి ఊపిరిఆడకుండా చేయవచ్చునని చెప్పారు. రాజకీయం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పిల్లలు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

    అసలైన రాజకీయం

    అసలైన రాజకీయం

    మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పనులు చేయించవచ్చునని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రి కావడమే రాజకీయ లక్ష్యం కాదన్నారు. సామాజిక మార్పు తేవడమే అసలైన రాజకీయం అని చెప్పారు. అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చునని, ఊపిరి ఆడకుండా చేయవచ్చునని చెప్పారు. హామీలను ఇచ్చి నెరవేర్చనప్పుడు ప్రజల తరఫున గళం విప్పుతానని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయించడమే అసలు రాజకీయం అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+