'ప్రత్యేక సీమ ఆత్మహత్యాసదృశ్యం': బైరెడ్డికి ఝలక్, బాబుకు ఊరట

చిత్తూరు: ప్రత్యేక రాయలసీమ నినాదం ఆత్మహత్యాసదృశ్యమని, దానికి కమ్యూనిస్టు పార్టీల మద్దతు లేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిపిఐ నారాయణ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రానికి తెలుగుదేశం, తెలంగాణకు తెరాస పరిమితమై పరస్పర సహకారంతో పాలన సాగించడం మంచిదన్నారు.

కాగా, నాడు తెలంగాణ ఉద్యమానికి సిపిఐ మద్దతు పలికింది. ఇప్పుడు రాయలసీమ ప్రత్యేక డిమాండును సిపిఐ వ్యతిరేకిస్తోంది.

రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాయలసీమతోనే తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నవ్యాంధ్ర ఏపీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

'No need Rayalaseema seperate state demand'

కానీ, విభజనకు ముందు, ఆ తర్వాత.. బైరెడ్డి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని టిడిపి చెబుతోంది.

అయినప్పటికీ బైరెడ్డి రాయలసీమవ్యాప్తంగా తిరుగుతూ ప్రత్యేక రాయలసీమ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఐ నేత నారాయణ మముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+