సిద్ధమే, కానీ రాజీనామాల అవసరం లేదు: జెసి

పార్లమెంటులో తెలంగాణ బిల్లును, శాసనసభలో తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేనందు వల్ల పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎంపీలు రాజీనామాలు చేసినంత మాత్రాన తమపై ఒత్తిడి రాదని ఆయన అన్నారు.
రాజీనామాలు చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌లో ఏం వస్తుందో చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొంత మంది ఎంపీలు రాజీనామాలు చేసినంత మాత్రాన యుపిఎ ప్రభుత్వానికి ఢోకా ఉండదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందువల్లనే రాజీనామాలపై వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. అందరం కలిసి త్వరలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రితో మళ్లీ రాజీనామాల అంశంపై మాట్లాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications