వైసీపీ హజరుకాకపోతే అసెంబ్లీ జరగదా?: జగన్ భాష మారదు, బాబుతో టిఆర్ఎస్ ఎంపీ భేటీ

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరుకాకపోయినా బాధ్యతతో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

అమరావతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరుకాకపోయినా బాధ్యతతో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని బాబు పార్టీ నేతలకు సూచించారు.

నవంబర్ 9వ, తేది నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి, బిజెపి సభ్యులు మాత్రమే హజరుకానున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హజరుకానున్న సభలో ప్రజా సమస్యలపై చర్చించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు.

మంగళవారం నాడు పార్టీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబునాయుడు చర్చించారు.

 వైసీపీ రాకపోతే సభ జరగదా?

వైసీపీ రాకపోతే సభ జరగదా?

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ నిర్ణయంపై పార్టీ ముఖ్యుల సమావేశంలో చంద్రబాబునాయుడు చర్చించారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి హజరుకాకపోతే సమావేశాలు జరగకూడదా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరగవా? ప్రజలు మనను ఎన్నుకొన్నారు. వారి పట్ల మన బాధ్యత మనం నిర్వహిద్దాం. ప్రజా సమస్యలను ఎన్ని వీలైతే అన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దాం. మంచి సంకేతాన్ని ప్రజలకు అందిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

 ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ సంపూర్ణంగా చేపట్టాలి

ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ సంపూర్ణంగా చేపట్టాలి

గత సమావేశాల్లో ప్రతిపక్షం సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడంతో అనేక నిబంధనల కింద చర్చలే మృగ్యమయ్యాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయంతోపాటు జీరో అవర్‌, సావధాన తీర్మానం, స్వల్ప వ్యవధి చర్చల వంటివి అన్నీ సంపూర్ణంగా చేపట్టాలని సీఎం సూచించారు.

 మండలిలో ఇబ్బంది లేదు

మండలిలో ఇబ్బంది లేదు

శాసనమండలిలో వైసీపీ కాకుండా ఇతర ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. అక్కడ చర్చలు మామూలుగానే జరుగుతాయని పార్టీ నేతలు చెప్పారు. అయితే వైసీపీ సభ్యులు మండలికి హజరుకారు. కాకపోతే ఇతర పార్టీలకు చెందిన సభ్యులు మండలిలో ప్రాతినిథ్యం ఉంది. దీంతో అన్ని రకాల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు బాబు దృష్టికి తెచ్చారు.

 జగన్ భాష మారదు

జగన్ భాష మారదు

జగన్‌ చేపట్టిన పాదయాత్ర గురించి సమావేశంలో ప్రస్తావించారు కొందరు పార్టీ నేతలు. పాదయాత్ర ప్రారంభమైన రోజుతో పాటు పాదయాత్ర సాగుతున్న సమయంలో జగన్ ఉపయోగిస్తున్న భాష పట్ల చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌ భాష... ధోరణి మారదని మరోసారి రుజువైందని, నోటికి వచ్చినట్లు తిట్టడం ఒక్కటే ఆయనకు తెలిసిన విద్యని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్యారడైజ్‌ పేపర్లలో ఆయన పేరు ఉందని, వారి అవినీతి చరిత్ర ఎంత లోతుగా ఉందో ఇదొక నిదర్శనమని అన్నారు. మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయం డిజైన్లను ఆయన ఈ సమావేశంలో పరిశీలించారు. వాటికి కొన్ని మార్పుచేర్పులు చేసి మళ్లీ తీసుకురావాలని ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన కార్యాలయానికి శంకుస్థాపన తర్వాత ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి కావాలని సూచించారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించారు. మెజారిటీ నియోజకవర్గాల్లో కార్యక్రమం బాగా జరుగుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

 బాబుతో టిఆర్ఎస్ ఎంపీ వినోద్ భేటీ

బాబుతో టిఆర్ఎస్ ఎంపీ వినోద్ భేటీ

కరీంనగర్ ఎంపీ వినోద్ ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తన తమ్ముడు శ్రీనివాసరావు కుమార్తె రసజ్ఞ వివాహానికి చంద్రబాబును వినోద్ ఆహ్వానించారు.ఇదిలా ఉంటే దివంగత ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి జయకృష్ణ మంగళవారం సచివాలయంలో చంద్రబాబును కలిశారు. కొంతసేపు మాట్లాడారు. వ్యక్తిగత విషయాలపై ఆయన కలిసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+