ఆళ్లగడ్డ ఉప ఎన్నిక: తొలి రోజు ఒక్క నామినేషన్ రాలేదు
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్లను మంగళవారం నుండి స్వీకరిస్తున్నారు. అయితే, తొలి రోజు అయిన మంగళవారం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ బరిలో నిలుస్తున్నారు.
2014 ఎన్నికల్లో పోటీ చేసిన శోభా నాగిరెడ్డి.. ఎన్నికలకు ముందే మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ పోటీ చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇటీవల కృష్ణా జిల్లాలోని నందిగామలో జరిగిన ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేసింది. సభ్యులు ఎవరైనా మృతి చెందితే వారి స్థానంలో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయవద్దనే సంప్రదాయం ఉంది. దీంతో టీడీపీ పోటీ చేయకపోవచ్చునని భావిస్తున్నారు. నందిగామ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది.

కాగా, తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ నాలుగు రోజుల క్రితం అన్నారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు.
అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమన్నారు. అమ్మలేని లోటు తీర్చలేనిదన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదన్నారు. అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా, త్వరలో జరగనున్న ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు గానూ భూమా నాగిరెడ్డి కుమర్తె భూమా అఖిలప్రియను తమ అభ్యర్థిగా వైయస్ జగన్ ప్రకటించిన అనంతరం దీనిని ఏకగ్రీవం చేసేందుకు ఆ పార్టీ అప్పుడే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉప ఎన్నికలో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టరాదని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు మైసూరా తదితరులు ఆ రోజు చంద్రబాబును కలిశారు. అయితే, వారి వినతికి చంద్రబాబు నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. స్థానిక నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు పైన మాత్రం స్థానిక నేతల నుండి ఒత్తిడి వస్తోంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications