ఆ కోపంతో దాడి చేశా: కన్నాపై దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఏమన్నాడు?
Recommended Video

కావలి: ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని గొర్రెపాటి ఉమామహేశ్వర రావుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందినవాడు. అతను ఓ లారీ డ్రైవర్ అని తెలుస్తోంది. కన్నాపై చెప్పులతో దాడి నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా దాడికి పాల్పడిన దుండగుడు మాట్లాడుతూ.. తనకు నరేంద్ర మోడీ అంటే ఉన్న కోపంతోనే కన్నా లక్ష్మీనారాయణపై దాడి చేశానని, తన వెనుక ఎవరూ లేరని చెప్పారని తెలుస్తోంది. ఎవరి ప్రోద్భలంతో దాడి చేయలేదన్నారు.

దాడి చేసిన దుండగుడి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. తన ఇంటికి రౌడీలను పంపించారని, అమిత్ షా పైన దాడి ప్రయత్నం జరిగిందని, కన్నా లక్ష్మీనారాయణపై దాడులు జరుగుతున్నాయని, పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇదంతా చూస్తుంటే టీడీపీ దాడులు అర్థమవుతోందన్నారు.
కన్నా లక్ష్మీనారాయణపై దాడి చేసిన వ్యక్తితో టీడీపీ ప్రభుత్వమే అలా చెప్పిస్తోందని మండిపడ్డారు. లేదంటే దాడి ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడుల వెనుక కచ్చితంగా చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications