డిసెంబర్ 6 నాటికి కాపు రిజర్వేషన్లు తేల్చాలి: ముద్రగడ
కాపు రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్ 6 డెడ్ లైన్ గా విధిస్తున్నట్టు ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం మరోమారు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను టిడిపి నెరవేర్చాలని ఆయన చంద్రబాబును కోరారు.
కాకినాడ: కాపు రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్ 6 డెడ్ లైన్ గా విధిస్తున్నట్టు ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం మరోమారు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీని చంద్రబాబునాయుడు నెరవేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారం నాడు కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడారు. ఇతర కులాలు అనుభవిస్తున్న 49 శాతంలో తమకు వాటా వద్దని చెప్పారు.

మిగిలిన 51 శాతంలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని చెప్పారు. కాపు జాతి రోడ్డెక్కే పరిస్థితి తెచ్చింది చంద్రబాబేనని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు.
కాపు ఉద్యమానికి మద్దతు తెలిపే అన్ని కులాలను కలుపుకునిపోతామని, అందులో భాగంగానే సామాజిక పరివర్తన సమావేశాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పల్స్ సర్వే ఒక్క రోజులోనే నిర్వహించారని చెప్పారు.
ఆ రిపోర్టును సీఎం కేసీఆర్ పరిశీలించి 9వ షెడ్యూల్ లో చేర్చారని ముద్రగడ చెప్పారు.అయితే ఏపీలో సీఎం చంద్రబాబు ఏ నివేదికను ఎందుకు తెప్పించుకోలేదని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications