పవన్ అమ్ముడుపోయారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు: కాంగ్రెస్‌తో దోస్తీపై గోరంట్ల
విజయవాడ: ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయ పొత్తులు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశంపై ఆయన స్పందించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు జైలు నుంచి బయటకు వచ్చారన్నారు.

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అఖిలపక్షాన్ని కూడగడుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వార్డు మెంబర్‌గా గెలవలేని జీవీఎల్ నర్సింహారావుకు టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అప్రజాస్వామిక చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం మొండి వైఖరితో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పత్తిపాటి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications