యూపీలో బీజేపీ గెలుపు! బండ్ల గణేష్‌ ఆశలు గల్లంతేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ ఆశలపై నీళ్లు చల్లిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎలా అంటే.. బండ్ల గణేష్..

హైదరాబాద్/లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ ఆశలపై నీళ్లు చల్లిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎలా అంటే.. బండ్ల గణేష్.. పౌల్ట్రీ పరిశ్రమలో తెలంగాణలో నెంబర్ వన్‌గా ఉన్నారు. రెండు వేల కోళ్లతో మొదలు పెట్టిన వ్యాప్యారం ఇప్పుడు పాతికలక్షల కోళ్లకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా తమ పౌల్ట్రీని విస్తరించాలని బండ్ల గణేష్ భావించారు. అందులో భాగంగా యూపీలో వంద ఎకారాల భూమిని కూడా సిద్ధం చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ద్వారా యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తక్కువ ధరకే భూమి ఇచ్చినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చెప్పడం గమనార్హం.

no poultry firm of Bandla Ganesh in Uttar pradesh

అయితే, ఎన్నికల తర్వాత అఖిలేశ్ ముఖ్యమంత్రి అయ్యాక పౌల్ట్రీ పెడతానని ధీమాగా చెప్పారు. మరి బీజేపీ వస్తే ఎలా అని ప్రశ్నించగా... ఐదేరేళ్ల తర్వాత పెడతానని, అదికూడా అప్పుడు అఖిలేశ్ వస్తేనే పెడతానని గణేష్ స్పష్టం చేశారు.

కాగా, మార్చి 11న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కు కూడా అందని మెజారిటీని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మరో ఐదారేళ్ల తర్వాత కూడా అఖిలేశ్ సీఎం అయ్యే అవకాశం లేదని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన పౌల్ట్రీ ఆశలు కల్లలైనట్లేనా అనే సందేహం కలుగుతోంది. అయితే, బీజేపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన పౌల్ట్రీని పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారా? వేచి చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+