విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదు, తగ్గిస్తాం: చంద్రబాబు
భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోమని , అవసరమైతే తగ్గించేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
విజయవాడ:భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోమని , అవసరమైతే తగ్గించేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
నవనిర్మాణదీక్షలో భాగంగా మంగళవారం నాడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఆయన పాల్గొన్నారు. మానవనరులు, అభివృద్ది-పెట్టుబడులు, ఆకర్షణ, ఉద్యోగ కల్పన అభివృద్దికి అవసరమైన ముందస్తు ప్రణాళికపై ఆయన చర్చించారు.

విభజన తర్వాత కూడ ఏపీలో చిచ్చుపెట్టాలని చూశారని చెప్పారు. బాధను కసిగా మార్చుకొని అభివృద్దికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. తెలుగుజాతి కోసమే హైద్రాబాద్ ను నాలెడ్జ్ హాబ్ గా తీర్చిదిద్దినట్టు తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యతన ఇస్తున్నట్టు చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలు కూడ ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రంంలో ప్రతి పేద విద్యార్థికి అండగా ఉంటామన్నారు.వారు కోరుకొన్న విద్యను ఉచితంగా ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications