సునంద మృతి: డాక్టర్‌పై ఒత్తిడి లేదన్న ఎయిమ్స్

ఈ కేసులో తనపై ఒత్తిడి వచ్చినట్లు సుధీర్ గుప్తా ఎప్పుడు కూడా చెప్పలేదని ఎయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్‌పర్సన్ డాక్టర్ నీరజా భాట్లా, అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా చెప్పారు. సుధీర్‌పై బయటివారినుంచి ఒత్తిడి వచ్చి ఉంటే తామేమీ చెప్పలేమని వారన్నారు.
ఆరోపణలను రుజువు చేయడానికి సాక్ష్యాలతో సుధీర్ గుప్తా ముందుకు రావాల్సి ఉండిందని వారన్నారు. సుధీర్ గుప్తాను ఫోరెన్సిక్ డిపార్టుమెంట్‌లో కొనసాగించాలా, వద్దా అనే విషయంపై ఎయిమ్స్ పాలనాయంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
సుధీర్ గుప్తా ఎందుకు భయపడ్డారనే విషయం పాలనావిభాగంలోని ఎవరికి కూడా తెలియదని, సుధీర్ గుప్తా సెలవులో ఉన్నారని, ఆయనను తాము సంప్రదించలేకపోయామని, అతను పరారీలో లేరని వారు వివరించారు.












Click it and Unblock the Notifications