సమస్యలు మీడియా సృష్టే: ఢిల్లీలో గవర్నర్, హోదాపై తేల్చేసిన సుజనా
న్యూఢిల్లీ/ విజయవాడ/ నెల్లూరు: తెలుగు రాష్ర్టాల్లో ఎలాంటి సమస్యలు లేవని ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియానే రెండు రాష్ర్టాల్లో ఈ సమస్యలను సృష్టిస్తోందని ఆయన శనివారంనాడు వ్యాఖ్యానించారు.
త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్ చెప్పారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. గోయల్‌తో సమావేశమైన తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ ఖరారు కావాల్సి ఉంది.
ఇదిలావుంటే, ఎపికి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తున్నారు. తమకు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆయన శనివారంనాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం ఈ నెల 11వ తేదీన తలపెట్టిన బంద్ అసందర్భమని, తెలుగుదేశం పార్టీ ఈ బంద్‌లో పాల్గొనబోదని సుజనా చౌదరి అన్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేలకోట్లు సంపాదించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ షరీఫ్ ఆరోపించారు. నెల్లూరు నగరంలో జరిగిన ముస్లిమ్‌ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు హయాంలో ముస్లిమ్‌ల సంక్షేమాన్ని విస్మరించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications