కారణమే లేదు .. పెళ్ళయి రెండు మాసాలైనా కాలేదు .. భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త
శాడిస్ట్ మనస్తత్వం ఉన్న ఓ భర్త చేసిన ఘాతుకం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తుంది. పట్టుమని పెళ్లై రెండు నెలలైనా కాలేదు . కట్టుకున్న వాడి కోసం కోటి ఆశలతో అత్తవారింటికి వచ్చిన ఆ యువతీ కలల్ని కల్లలు చేస్తూ కానరాని లోకాలకు పంపేశాడు భర్త రూపంలో ఉన్న నర రూప రాక్షసుడు . ఏం మాయ రోగమో తెలీదు కానీ కట్టుకున్న దాన్నే కాటికి పంపాడు . పెళ్లయిన పది రోజుల నుంచే ఆత్మహత్య చేసుకుందామంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అదేదో సినిమా చూద్దాం అన్నంత ఈజీగా చచ్చిపోదాం రా అంటూ భార్యను పిలిచాడు. అలా మాటిమాటికీ చద్దామంటే అంత సీరియస్ గా తీసుకోకపోవటమే ఆ యువతి పాలిట మరణ శాసనం అయ్యింది.

భార్యను రాళ్ళు, కర్రతో మోది చంపి .. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త
ఇక భార్యను చచ్చిపోదాం పద అని అడిగిన ఆ భర్త భార్య ససేమిరా అనటంతో ఒక ప్లాన్ వేశాడు . బంధువుల ఇంటికి వెళ్దామని చెప్పి నమ్మకంగా ద్విచక్ర వాహనం ఎక్కించుకొని పొలం తీసుకెళ్లాడు. అక్కడ రాళ్లు, కర్రతో దాడి చేసి ఆమెను హతమార్చాడు. భార్యను చంపినతవాత కూల్ డ్రింకులో పురుగు మందు తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా పెళ్లయిన 50 రోజులకే మరణశాసనం రాసేశాడు . గిద్ద లూరు మండలం ఉయ్యాలవాడలో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

పెళ్లి జరిగి రెండు నెలలైనా కాకముందే దారుణం .. ఏ సమస్య లేకున్నా ఈ ఘాతుకానికి ఒడిగట్టిన రామయ్య
పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పిక్కిలి రామయ్యకు ఆదిమూర్తిపల్లికి చెందిన చంద్రవతితో మే 22న వివాహం జరిగింది. రామయ్య వ్యవసాయం చేయడంతోపాటు సొంత ట్రాక్టర్‌ను నడుపుకొని జీవిస్తున్నాడు. అంతా బాగానే ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఏమీ లేవు. ఆర్ధిక ఇబ్బందులు కానీ , మరే ఇతర సమస్యలు కానీ లేవు .పెళ్లయిన పది రోజులు దాటిప్పటి నుంచి ఆత్మహత్య చేసుకుందామని భార్యపై రామయ్య ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. పలు సందర్భాల్లో ఆమె ఆయనకు నచ్చచెప్పింది.అయినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన తల్లి దండ్రులతోపాటు అత్తమామలకు చెప్పింది. వారు పలు పర్యాయాలు రామయ్యతో మాట్లాడారు. ఆత్మ హత్య ఆలోచన ఎందుకు చేస్తున్నా డని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రామయ్య ఏమీ చెప్పలేదు.

పొలంలో భార్యాభర్తల మృతదేహాలు ..కేసు దర్యాఫు చేస్తున్న పోలీసులు
ఇక బంధువుల ఇంటికి అని చెప్పి పొలం వద్దకు తీసుకెళ్ళి భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు .బుధవారం ఉదయం అటువైపు వెళ్లిన పశువుల కాపరులు పొలంలో ఉన్న మృతదేహా లను చూసి గ్రామస్థులకు తెలియజేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది .దీంతో రామయ్య తల్లిదం డ్రులు అక్కడికి చేరుకుని మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications