ప్రధాని సమక్షంలోనే పొలిటికల్ ట్విస్ట్ - గంటల్లోనే సీన్ మార్చేసిన సీఎం జగన్..!!
జనసేనానికి ప్రధాని నుంచి ఆహ్వానం..భేటీ ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ ఇచ్చింది. ప్రధానితో భేటీ తరువాత పవన్ సైతం ఏపీ భవిష్యత్ కు రానున్న రోజుల్లో మంచి జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇక...ఈ భేటీ ద్వారా బీజేపీ - జనసేన పొత్తు ఖాయమని తేలిపోయింది. ఇప్పుడు టీడీపీ తో పొత్తు ఏంటనేది ప్రశ్నగా మారింది. అటు పవన్ కు ప్రధాని అప్పాయింట్ మెంట్ ఖరారు కావటంతోనే వైసీపీ ఇటు అలర్ట్ అయింది. ఎక్కడా ప్రధాని - పవన్ భేటీ పైన విమర్శలు చేయలేదు. అంత ప్రాధాన్యత అవసరం లేదనే విధంగా పార్టీ నేతలు వ్యవహరించారు.

ఇరకాటంలోకి నెట్టిన సీఎం జగన్
ఇక..సీఎం జగన్ ప్రధాని పర్యటన వేళ..సిట్యుయేషన్ ను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. అటు ప్రధానితో పవన్ భేటీ తరువాత.. బీజేపీ - జనసేన మధ్య పొత్తు..త్వరలో టీడీపీని కలుపుకు వెళ్తారనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే.. విశాఖ కేంద్రంగా జరిగిన బహిరంగ సభలో ప్రధానితో తమ అనుబంధం గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ ఏపీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసే ఏ మంచి అయినా కూడా.. ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించటం ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమైంది.

ప్రధానితో తమ సంబంధాలపై ప్రత్యేకంగా
ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటన సమయంలో ప్రధానితో ఒన్ టు ఓన్ సమావేశంలో సీఎం జగన్ ఏపీ అంశాలు - పెండింగ్ సమస్యలను ప్రస్తావించే వారు. ఇప్పుడు బహిరంగ సభలోనే అందరి సమక్షం లోనే పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని విన్నవించారు. అదే సమయంలో రాజకీయాలకు అతీతంగా పెద్దలు, సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలంటూ వినయ పూర్వకంగా అభ్యర్ధించారు. దీని ద్వారా రాజకీయంగా కేంద్రంలోని ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించినా..తాము మాత్రం కేంద్రంతో అనుబంధం రాజకీయాలకు అతీతమని.. రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేసారు.

రాష్ట్ర ప్రయోజనాలే తన లక్ష్యమంటూ
దీంతో..అటు పొత్తుల దిశగా జనసేన -టీడీపీ తమతో పాటుగా బీజేపీని కలుపుకొని పొత్తుగా వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఆ రెండు పార్టీలకు బ్రేకులు వేసే విధంగా జగన్ వ్యవహరించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ తాను ప్రధానిని కలిసిన తరువాత రాష్ట్రంలో అమలు కావాల్సిన పెండింగ్ డిమాండ్లు.. హోదా వంటి వాటి పైన ప్రధానితో చర్చించినట్లు చెప్పలేదు. అదే సమయంలో టీడీపీ ఈ మధ్య కాలంలో ఏపీ కి కేంద్ర నుంచి రావాల్సిన అంశాల పైన పెద్దగా స్పందించటం లేదు. కానీ, ఇప్పుడు సీఎం జగన్ బహిరంగ సభలో వీటిని ప్రస్తావించటం వ్యూహాత్మకం గా చెబుతున్నారు. అటు టీడీపీతో బీజేపీ పొత్తు ఏంటనేది ఇంకా క్లారిటీ రాకుండానే..ఏకంగా ప్రధాని పిలిచి మాట్లాడటంతో పవన్.. ఒక విధంగా బీజేపీని వీడి ముందుకెళ్లే అవకాశం ఉండదు. టీడీపీతో బీజేపీ నో చెబితే..ఏం చేస్తారనేది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.












Click it and Unblock the Notifications