టి 'బతుకమ్మ' జై తెలంగాణ, జై సీమాంధ్ర (పిక్చర్స్)

మహబూబ్ నగర్: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు నెలలు గడువు ఉందని, ఆలోపు ఎలాంటి చర్చలు జరిపినా తెలంగాణ బిల్లు పెట్టాలని కాంగ్రెసు పార్టీకి భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్ తుది గడువు విధించారు. అప్పటి లోగా తెలంగాణ బిల్లు పెట్టకుంటే తాను ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అనే బిల్లు ఉండాలని, సిడబ్ల్యూసి చేసిన తీర్మానం ప్రకారమే బిల్లు ఉండాలని, అలా అయితేనే తమ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు.

కేంద్రం అలా చేస్తే విజయోత్సవాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తానని లేదంటూ మరోసారి మోసం చేస్తే మలిదశ ఉద్యమంలో పాల్గొనేందుకు స్వయంగా వస్తానని చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, యూ టర్న్ లేదన్నారు. మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సుష్మ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా బిల్లుకు మద్దతు తెలుపుతామన్నారు.

విజయంతో వినయంగా ఉండాలని, విభజన ప్రజల మధ్య కాదన్నారు. ప్రత్యేక తెలంగాణ అన్న సుష్మా.. సీమాంధ్రుల పైన రెచ్చగొట్టే మాటలు వద్దని సూచించారు. ప్రాంతాల మధ్యనే విభజన తప్ప ప్రజల మధ్య కాదన్నారు. ఇరు ప్రాంతాలు తమకు సమానమేనని చెప్పారు. సుష్మ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి ఆకట్టుకున్నారు. సుష్మా చివరకు జై తెలంగాణ, జై సీమాంధ్ర అని నినాదం చేశారు. సుష్మా తెలంగాణకు బతుకమ్మ అని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ కితాబిచ్చారు.

జన సందోహం

జన సందోహం

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సుష్మా స్వరాజ్ సభకు భారీగా తరలి వచ్చిన మహిళలు

సుష్మా, నాగం, కిషన్

సుష్మా, నాగం, కిషన్

సభా వేదిక పైనుండి అభివాదం చేస్తున్న బిజెపి అగ్ర నేత సుష్మా స్వరాజ్, నాయకులు విద్యాసాగర రావు, ఇంద్రసేనా రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, కిషన్ రెడ్డిలు.

సుష్మ డెడ్ లైన్

సుష్మ డెడ్ లైన్

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు నెలలు గడువు ఉందని, ఆలోపు ఎలాంటి చర్చలు జరిపినా తెలంగాణ బిల్లు పెట్టాలని కాంగ్రెసు పార్టీకి భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్ తుది గడువు విధించారు. ఈ సభలో సుష్మ జై తెలంగాణ, జై సీమాంధ్ర అని నినాదాలు చేశారు.

కార్యకర్తల ఉత్సాహం

కార్యకర్తల ఉత్సాహం

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సుష్మా స్వరాజ్ సభకు వచ్చిన కార్యకర్తల ఉత్సాహం.

జనం

జనం

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సుష్మా స్వరాజ్ సభకు భారీగా తరలి వచ్చిన జనం.

బతుకమ్మ

బతుకమ్మ

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సుష్మా స్వరాజ్ సభకు బతుకమ్మ, బోనాలతో వచ్చిన మహిళలు.

ఆటా పాట

ఆటా పాట

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సుష్మా స్వరాజ్ సభా వేదిక పైన ఆటా పాటా దృశ్యం.

సన్మానం

సన్మానం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు పలుకుతున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్‌కు శాలువా కప్పి సన్మానం చేస్తున్న ఓ మహిళ.

నాగం

నాగం

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న నాగం జనార్ధన్ రెడ్డి.

శ్రీనివాస్

శ్రీనివాస్

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్

కోదండరామ్

కోదండరామ్

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న టిజెఏసి చైర్మన్ కోదండరామ్.

మహిళలతో సుష్మ

మహిళలతో సుష్మ

మహబూబ్ నగర్ పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో సుష్మా స్వరాజ్‌తో పలువురు మహిళలు.

లంబాడీ మహిళలతో

లంబాడీ మహిళలతో

మహబూబ్ నగర్ పాలమూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో సుష్మా స్వరాజ్‌తో పలువురు లంబాడీ మహిళలు.

శంషాబాద్ విమానాశ్రయంలో

శంషాబాద్ విమానాశ్రయంలో

పాలమూరు సభకు వచ్చిన భారతీయ జనతా పార్టీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ శంషాబాద్ విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న దృశ్యం.

హారతులు

హారతులు

పాలమూరు సభకు వచ్చిన భారతీయ జనతా పార్టీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ శంషాబాద్ విమానాశ్రయం నుండి బయటకు వస్తుండగా మహిళల హారతులు.

నాగం స్వాగతం

నాగం స్వాగతం

పాలమూరు సభ కోసం వచ్చిన తమ పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+