వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఏమీ తెలియదు: కాల్వ, అసెంబ్లీలో వైఎస్ ఫోటోకు నో

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసనసభ లాంజ్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోను తొలగించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన విమర్శపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. అధికారులను ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదని ఆయన అన్నారు.

జనరల్ పర్పస్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ లాంజ్‌లో మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండవని, మాజీ స్పీకర్ల ఫోటోలు మాత్రమే ఉంటాయని తేల్చింది. జగన్‌కు అనుభవం లేదని, నిబంధనలు కూడా తెలియవని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Kalva Srinivasulu

రాష్ట్రానికి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఏమీ లేదని, తెలుగు జాతి పేరను ప్రపంచానికి చాటిన ఎన్టీ రామారావు ఫొటోను అసెంబ్లీలో పెడుతామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఫొటోతో పాటు ఇతర మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను అసెంబ్లీ కమిటీ హాల్‌లో పెట్టుకునే ఏర్పాటు చేయాలని జనరల్ పర్పస్ కమిటీ అభిప్రాయపడింది.

కాగా, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో శాసనసభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చూడాలని కమిటీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కోరనుంది. అసెంబ్లీ లాంజ్‌లో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను తొలగించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే.

English summary
YS Rajasekhar Reddy photo will not beplaced in assembley loungue, Kalva Srinivasulu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X