వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు ఒక్కరోజే..: నామినేషన్ల కోలాహలం: గ్రామాల్లో ఎన్నికల వేడి.. !

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం పతాక స్థాయికి చేరుకుంటోంది. మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడటంతో ఇక.. అన్ని ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోలను నిర్వహించబోతున్నాయి.

టీడీపీకి డబుల్ చెక్: అటు బిగ్ షాట్ అంబానీ..ఇటు బీసీ ఓటుబ్యాంకు: జగన్ వ్యూహం వెనుక.. !టీడీపీకి డబుల్ చెక్: అటు బిగ్ షాట్ అంబానీ..ఇటు బీసీ ఓటుబ్యాంకు: జగన్ వ్యూహం వెనుక.. !

గడువు..రేపు ఒక్కరోజే
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. సోమవారమే నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియ ఆరంభమైంది. బుధవారం నాటితో ముగియబోతోంది. తొలి రోజు ఆశించిన స్థాయిలో నామినేషన్లు దాఖలు కాలేదు. మంగళ, బుధవారాల్లో ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 12న ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు పరిశీలన.. 13న నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

 Nomination for local body polls begin in Andhra Pradesh across the State

Recommended Video

AP Local Body Elections 2020 Schedule | Government's Incentives To Unanimous Panchayats | Oneindia

గ్రామాల్లో ఎన్నికల వేడి..
రాష్ట్రవ్యాప్తంగా 660 జెడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్లను దాఖలు చేయడానికి అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. నామినేషన్లను దాఖలు చేయడానికి మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో మంగళ, బుధవారాల్లో అభ్యర్థుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
The nominations process for local body elections began in Andhra Pradesh. The nominations for MPTC and ZPTC elections will be received upto March 11. Polling will be conduct on March 21st for MPTC and ZPTC counting on March 24th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X