వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానారెడ్డిపై ఈసికి నోముల ఫిర్యాదు: పార్థసారథిపై టిడిపి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి, నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై తన ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జానారెడ్డి డబ్బుతో ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని నర్సింహయ్య ఆరోపించారు. జానారెడ్డి ఓటర్లను ప్రలోభపెడ్తున్నాడని నోములు ఫిర్యాదు చేశారు.

పార్థసారథిపై ఈసికి టిడిపి ఫిర్యాదు

ప్రకాశం: మచిలీపట్నం లోకసభ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారథిపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేత కోనేరు సురేష్ ఫిర్యాదు చేశారు. ఫెరా కేసులో కోర్టు జరిమానా విధించినందున పార్థసారథిని అనర్హుడిగా ప్రకటించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్థసారథి నామినేషన్ తిరస్కరించాలని కోరారు.

Nomula Narsimhaiah files a complaint against Janareddy to EC

పెండింగ్‌లో గంటా నామినేషన్

విశాఖపట్నం: జిల్లాలోని భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. గంటా నామినేషన్‌పై సోమవారం ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.కాగా, అనంతపురం జిల్లా మడకశిర టిడిపి అభ్యర్థి ఈరన్న నామినేషన్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈరన్నపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని, నామినేషన్‌లో ఆ విషయాలు ప్రస్తావించలేదని ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారులు ఆయన ఫిర్యాదును పరిశీలిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్‌పై కూడా అభ్యంతరం వ్యక్తమైంది. జయనాగేశ్వర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో అవకతవకలు ఉన్నాయని మాజీ కౌన్సిలర్ ఒకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

English summary
Telangana Rashtra Samithi Nagarjuna Sagar assembly constituency candidate Nomula Narsimhaiah filed a complaint to EC on former minister Janareddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X