తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్ .. 34 దుంగలు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా జరుగుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు అధికారులకు విస్మయాన్ని కలిగిస్తోంది. నిత్యం ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వీరి ఆగడాలకు అడ్డు కట్ట వెయ్యటం పోలీసులకు, టాస్క్ ఫోర్స్ అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం అడవిలోకి వెళ్ళిన తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Gold smuggling: వారి మలద్వారంలో 7.3కిలోల బంగారం: షాక్ అయిన కస్టమ్స్ అధికారులు; నలుగురు అరెస్ట్!!Gold smuggling: వారి మలద్వారంలో 7.3కిలోల బంగారం: షాక్ అయిన కస్టమ్స్ అధికారులు; నలుగురు అరెస్ట్!!

గ్జైలో వాహనంలో 34 ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా.. పట్టుకున్న టాస్క్ ఫోర్స్

గ్జైలో వాహనంలో 34 ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా.. పట్టుకున్న టాస్క్ ఫోర్స్

చిత్తూరు జిల్లాలో గ్జైలో వాహనంలో 34 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకుని, వాహనం సహా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లు ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావుకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ సురేష్ బృందం ఆదివారం రాత్రి నుంచి అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు కూంబింగ్ చేపట్టారు.

 అలిపిరి రోడ్డులో అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ .. తమిళ స్మగ్లర్ల అరెస్ట్

అలిపిరి రోడ్డులో అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ .. తమిళ స్మగ్లర్ల అరెస్ట్

అలిపిరి రోడ్డులో టిటిడి ఎంక్లోజర్ లో ఓ కంటి ఆసుపత్రి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు గ్జైలో వాహనంలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూండటం కనిపించింది.దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా కొందరు స్మగ్లర్లు దుంగలు పడవేసి పారిపోయారని, వారిలో ముగ్గురిని పట్టుకోగలిగినట్లు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన బాల మురుగన్ (24), వెంకటేషన్ (27), అన్నాదురై (43) గా గుర్తించినట్లు తెలిపారు. వీరు లోడ్ చేస్తున్న గ్జైలో వాహనంతో పాటు 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

రోజు రోజుకూ పెరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులు

రోజు రోజుకూ పెరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులు


స్మగ్లర్లు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో తప్పించుకున్న వారి కోసం గాలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు.ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో రెండు ఇన్నోవాలలో తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక గత కొంతకాలంగా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా రోజు రోజుకూ రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎర్రచందనం దుంగలను కొట్టి స్మగ్లర్లు ఇతర రాష్ట్రాలకే కాదు, విదేశాలకు సైతం తరలిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

మైనర్లతోనూ దందా .. రాయలసీమలో విస్తరిస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్

మైనర్లతోనూ దందా .. రాయలసీమలో విస్తరిస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్

ఇక ఎర్ర చందనం అక్రమ రవాణాకు, దుంగలను కొట్టటానికి మైనర్ బాలురను కూడా తీసుకువస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పెట్టడానికి ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లర్ల దందాలు సాగుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు, అంతర్రాష్ట్ర దొంగలు మాత్రమే కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పేరు మోసిన క్రిమినల్స్, రౌడీషీటర్ల ప్రమేయం కూడా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా నిదానంగా చాప క్రింద నీరులా ఎర్ర చందనం స్మగ్లర్ల ముఠా విస్తరిస్తోంది. ఈ గ్యాంగ్ లను కట్టడి చెయ్యకుంటే కష్టం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుం

English summary
The task force police intercepted and seized 34 red sandalwood logs, including a xylo vehicle, in Chittoor district. Three smugglers transporting these were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X