రైతులను వేధించొద్దు, కౌలు చెల్లించడంలో జాప్యమొద్దు, ప్రభుత్వాన్ని కోరిన జనసేనాని పవన్ కల్యాణ్
కరోనా వైరస్ ప్రబలి.. ఆపత్కాలంలో ఉన్న రైతులను వేధించడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఆ చర్యలను వెంటనే ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. భూమి లేని పేదలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పవన్ కల్యాణ్ కోరారు.
లాక్ డౌన్ వల్ల రైతులకు అనేక సందేహాలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించే సమయం వచ్చిందని తెలిపారు. కానీ కరోనా వైరస్ వల్ల కౌలు ఇస్తారా లేరోననే ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతుల కౌలు చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా ఉండాలన్నారు. వారికి అందజేసే కనీస కౌలును కూడా ఆలస్యం చేస్తే వారి జీవనం దుర్భరం అవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలో పెన్షన్లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. సకాలంలో అందజేస్తే వారికి ప్రయోజనం కులుగుతుందని చెప్పారు. లేదంటే వారు కనీస అవసరాలను కూడా తీర్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుచేశారు. పెన్షన్లలో కోత లేకుండా చూస్తోన్న ప్రభుత్వం.. సమయానికి ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications