నోటుకు ఓటుపై రాజ్‌నాథ్‌తో మాట్లాడలేదు: సుజనా, తిప్పికొడ్తామని సోమిరెడ్డి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నోటుకు ఓటు కేసుపై గానీ, ఎపి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 గురించి గానీ చర్చించలేదని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి చెప్పారు. ఆయన గురువారంనాడు రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌శాఖ ఆధునీకరణకు రూ. 500 కోట్లు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌కు నిధుల అంశంపై భేటీలో చర్చించినట్టు భేటీ అనంతరం ఆయన మీడియాతో చెప్పారు.

ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజలు, ప్రభుత్వ పెద్దలకు జరుగుతున్న అవమానాన్ని తిప్పి కొడతామని గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బీద రవిచంద్ర అన్నారు. నిరంతరం పార్టీ ఉన్నత కోసం పనిచేస్తామని ఎమ్మెల్సీలు జనార్థన్, శ్రీనివాసులు తెలిపారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక అయిన ఈ నలుగురు నేతలు గురువారం శాసనమండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నవాళులర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ, కార్యకర్తలు, రాష్ట్రం, నాయకుడి కోసం రాజీపడకుండా, నిస్వార్థంగా పనిచేస్తామని అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలో తెలంగాణ ప్రభుత్వం పెట్టినవి తప్పుడు కేసులని ఆయన అన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications