వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి దిమ్మ తిరిగేలా ఢిల్లీలో పోరాటం చేయాలి, ఏపీలో చేస్తే లాభం లేదు: సుమన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి ఏపీ రాష్ట్ర ప్రజల బాధలు తెలిసేలా ఢిల్లీలో పోరాటం చేస్తే ఉపయోగం ఉంటుందని సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజల నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా పోరాటం ఉండాలని సుమన్ సూచించారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు ఆందోళన బాట పట్టాయి.ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని సుమన్ అభిప్రాయపడ్డారు.

Not here, Protest in Delhi to pain centre : Suman on AP Budget

ఏపీలో ఎంత పెద్ద ఆందోళన చేసినా, బంద్‌లు నిర్వహించినా ప్రయోజనం ఉండదన్నారు. ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని సుమన్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి ఏపీ ప్రజల నిరసనను తెలిసేలా ఆందోళనలు ఉంటే అప్పుడు కేంద్రంలో కదలిక వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఆందోళనలు చేసుకొంటూ పోతే కేంద్రానికి చీమకుట్టినట్టు కూడ ఉండదని సుమన్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి తెలిసేలా ఆందోళనలు నిర్వహిస్తే అప్పటికైనా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసి ఏపీ న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Senior actor Suman has alleged that Union Budget 2018-19 failed to serve the people of the Andhra Pradesh state. Speaking to media channels, the senior actor has suggested various political leaders of the state to show their resentment against the center by protesting in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X