వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసులే మోడీ మెడకా!..ఈ ప్రచారంలో వాస్తవం ఎంత?..ఏది నిజం?..ఏది అబద్దం?

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మారిషస్ భారత ప్రభుత్వాన్ని కోర్టుకు లాగింది. ఇందూటెక్ జోన్‌లో పెట్టుబడులు పెట్టి తాము నష్టపోయామని నెదర్లాండ్స్‌లోని ఆర్బిట్రేషన్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. జగన్ కేసులో ప్రధాని మోడీతో సహా పలువురు మంత్రులకు మారిషస్ ప్రభుత్వం లీగల్ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో జగన్ కేసు వల్ల అంతర్జీయంగా భారతదేశం పరువు పోయింది...అలాగే ప్రధాని మోడీ,పలువురు మంత్రులు దోషులుగా మారిపోయారు...అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ఊదరగొట్టేస్తున్నాయి...

Recommended Video

Sakshi vs Andhrajyothy Counters Over Mauritius Legal Notice

నిజంగా కేవలం జగన్ కేసు వల్లే ఇండియా పరువు ఇంటర్నేషనల్ గా పోయిందా?...ఇలా కంపెనీలు భారత ప్రభుత్వానికి, ప్రధాని మోడికి నోటీసులు పంపడం ఇదే మొదటిసారా?...కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకు ప్రచారం చేస్తున్నఈ వార్తకు సంబంధించి అసలు నిజాలు ఏమిటి?...ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ప్రచారంలో ఏది నిజం?...అదొక్కటేనా?...

ఈ ప్రచారంలో ఏది నిజం?...అదొక్కటేనా?...

జగన్ కేసుకు సంబంధించి మారిషస్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి నోటీసులు పంపిన విషయం వాస్తవం...అయితే జగన్ కేసు వల్లే తొలిసారిగా ఇలా భారత్ ప్రభుత్వం నోటీసులు అందుకోవాల్సి వచ్చిందన్నట్లుగా వండి వారుస్తున్నవార్తలే అబద్దం. భారత ప్రభుత్వం ఇలా విదేశాల నుంచి నోటీసులు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం నేపథ్యంలో నిస్సాన్ ఇండియా, ఎపి కేజీ బేసిన్ వ్యవహారంలో విదేశీ సంస్థలతో సహా రిలయన్స్ ఇలా భారత ప్రభుత్వం పైన కేసులు వేశాయి. అంతేకాదు...రస్ ఆల్ ఖైమా, పెన్నా ప్రతాపరెడ్డి కలసి పెట్టే అల్యూమినియం రిఫైనరీ...స్వార్థ ప్రయోజనాలతో కూడు కున్నదంటూ టిడిపి ప్రభుత్వం రద్దు చేయడంతో రస్ ఆల్ ఖైమా కూడా భారత ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

ఇదే మొదటిసారి కాదు...ఇది అసాధారణం కూడా కాదు!

ఇదే మొదటిసారి కాదు...ఇది అసాధారణం కూడా కాదు!

అసలు ప్రభుత్వాలకు ఈ నోటీసులు ఏమిటి?...ఎందుకోసం?...వీటినెలా అర్థం చేసుకోవాలి?...అంటే..తమ పెట్టుబడుల రక్షణ కోసం వివిధ దేశాలు పరస్పరం ఒప్పందాలు చేసుకొంటాయి...అంతేకాదు ఇలా అంతర్జాతీయ సంస్థలు పెట్టే పెట్టుబడుల రక్షణ కోసం ఇంటర్నేషనల్ ట్రేడ్ లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం ఒక దేశంలో పెట్టిన పెట్టుబడులు పనికిరాకుండా పోయే పరిస్థితి వస్తే...ఆయా దేశాలు...తమకు నష్టం వాటిల్లిన దేశం మీద నిబంధనలు, ఒప్పందాల ఆధారంగా ఆర్బిట్రేషన్ కేసులు పెడతాయి. ఇది అసాధారణం కాదు.

గతంలో ఇలా కేసులు...చాలా ఉన్నాయి...

గతంలో ఇలా కేసులు...చాలా ఉన్నాయి...

తమిళనాడు ప్రభుత్వం మీద జపాన్ కు చెందిన నిస్సాన్ ఇండియా ఇలా ఆర్బిట్రేషన్ కేసులు వేసింది...వీటిలో కూడా ప్రధాని మోడీ, వివిధ ప్రభుత్వ శాఖలకు నోటీసులు అందాయి...ఇలా ఆ ఒక్క దేశం నుంచే పదుల సంఖ్యలో కేసులు భారతదేశంపై నమోదయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రిలయన్స్ సంస్థ కూడా కేజీ బేసిన్ రేట్ల వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై, సంబంధిత మంత్రిత్వ శాఖలపై ఆర్బిట్రేషన్ కేసు వేసింది...అలాగే ఎపి రాజధాని అభివృద్ది సంస్థ సిఆర్డిఎ
విదేశీ సంస్థలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో ప్రధాన నిబంధన ఏమిటంటే...వీటితో ఏ సమస్య వచ్చినా ఆయా దేశాల్లో కేసులు వేసి తేల్చుకోవాల్సిందే అని...ఆ ప్రకారం ఎవరైనా రాజధాని ప్రాంత రైతుకు ఫలానా సంస్థ వల్ల ఇబ్బంది కలిగితే అతడు ఆ సంస్థ దేశమైన సింగపూర్ కో, స్విర్జర్లాండ్ కో వెళ్లి కేసు వేసుకోవాల్సిందే...

ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే...ఎప్పుడూ ఉంటుంది...

ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే...ఎప్పుడూ ఉంటుంది...

జాతీయంగా నైనా, అంతర్జాతీయంగా నైనా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారం చేయడం సహజం...వ్యాపారం అనగానే సమస్యలు, లాభాలూ, నష్టాలూ..అంతే సర్వసామాన్యం. నష్టపోయినప్పుడు ఆ సంస్థలు ఒప్పందం ప్రకారం చేయలేకపోయినందుకు కేసులు పెట్టడం...నష్టపరిహారం అడగడం ఎక్కడైనా...ఎప్పుడయినా...జరిగేదే. జరిగిన అసలు వాస్తవాన్ని ప్రజలు వేరే విధంగా అనుకునేలా...ఉద్దేశ్యపూర్వకంగా ఎవరు దుష్ప్రచారం చేసినా...అది కూడా నైతికంగా తప్పేకదా!

English summary
Is the Indian government receive such notices first time in Jagan's case? ... There are news coming in some media ...The facts are different in this regard...These are the original facts in the issue of that the Government of India has suffered due to the Jagan case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X