ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!

ఏపీలో అక్టోబర్ 19న మంగళవారం దసరా పండుగ సెలవు దినంగా ఉన్న నేపథ్యంలో పండుగ ముందు రోజు సోమవారం సెలవు వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఉద్యోగులకు అదనపు సెలవు ఇచ్చింది. అయితే దానికి బదులుగా నవంబర్ 14న రెండో శనివారం సెలవుకు (November 14 Holiday) బదులు పనిచేయాలని షరతు పెట్టింది.

ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!
ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!

దీంతో ఇప్పుడు నవంబర్ 14న రెండో శనివారం పనిచేయాలా లేక సెలవు ఇస్తున్నారా అన్నదానిపై ఉద్యోగుల్లో అనుమానాలు నెలకున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులకు స్పష్టత ఇచ్చింది. అయితే గత నెల 19న ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఐఆర్ కార్యక్రమం, దసరా ఉత్సవాలు, సరస్ మేళా వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఆ రోజు విధుల్లోనే ఉన్నారు. కాబట్టి రెండో శనివారం పనిదినంగా కాకుండా ఎప్పటిలాగే సెలవు ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆయా ఉద్యోగులకు ఆ మేరకు నవంబర్ 14న రెండో శనివారం యథాతథంగా సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. మిగతా ఉద్యోగులు మాత్రం యథాతథంగా పనిచేయాలని ఆదేశించింది.

November 14 Holiday AP Govt Clarifies Leave Status for Employees Who Participated in Local Body Elections
స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!
స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!

ఎన్నికలు, దసరా, సరస్ తదితర విధులకు హాజరైన ఉద్యోగులు అందరినీ 14వ తేదీ రెండవ శనివారం సెలవు దినంగా వినియోగించుకోమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి రాష్ట్రంలోని గ్రామ సచివాలయం నుండి జిల్లా స్థాయిలో ఎన్నికలు, దసరా, సరస్ తదితర విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు అందరూ నవంబర్ 14న రెండవ శనివారం సెలవును ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యధాతథంగా సెలవు దినంగా వాడుకోవాల్సిందిగా ఉద్యోగులను ఏపీ జేఏసీ అమరావతి కోరింది. దీంతో ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఎన్నికల సంఘం పలు చోట్ల సెలవులు ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు మాత్రం ఇప్పుడు సెలవు తీసుకునే అవకాశం లభించింది. మిగతా ఉద్యోగులు మాత్రం రెండో శనివారం పనిచేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+