గెలవాలంటే అలా చెయ్యాలి.. ఇప్పుడు అన్ని రాజకీయపార్టీల ఫోకస్ పోల్ మేనేజ్మెంట్ పైనే!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల సమయంలో ప్రచార పర్వం ముగిసింది. నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన ప్రధానంగా దృష్టి సారించాయి. పోల్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేయగలిగితే అంత మంచి రిజల్ట్ వస్తుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
పార్టీ నేతలతో అభ్యర్థుల మంతనాలు
ఇంతకాలం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది? మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? అవతల పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తామంటున్నారు? మనం ఎంత ఇస్తే వర్కౌట్ అవుతుంది? వంటి చర్చ అన్ని రాజకీయ పార్టీలలోను అభ్యర్థులు పార్టీ నేతలతో చేస్తున్నారు.

ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ వర్గాల వ్యూహాలు
రేపు జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను మన వైపుకు తిప్పుకోవాలి అంటే ఏం చెయ్యాలి అన్న దానిపైన వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనించాలని, బూత్ స్థాయిలో నిఘా పెంచాలని, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలవాలని ప్రధానంగా చర్చిస్తున్నారు. పోలింగ్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో టెన్షన్ పీక్స్ కు చేరుకుంది.
పోల్ మేనేజ్మెంట్ పైనే ప్రధానంగా ఫోకస్
దీంతో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతామని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెడుతున్న అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెర తీశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రలోభ పెట్టే పని మొదలుపెట్టాయి. ఏరియాల వారీగా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బులు పంచాలని నిర్ణయించుకున్న రాజకీయపార్టీలు ఈరోజు రాత్రికి రాత్రే ఓటర్ల మనసును మార్చాలని భావిస్తున్నాయి.
ఓటర్లను ప్రలోభ పెట్టే యత్నాలు
ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో ఓటుకు వెయ్యి నుండి 2000 వరకు ఇస్తున్నట్టు సమాచారం.
పోల్ మేనేజ్మెంట్ ఎవరికి అధికారం కట్టబెడుతుందో
ఏది ఏమైనా బూత్ స్థాయిలో ఉన్న నాయకులు ఇప్పుడు చక్రం తిప్పితే అభ్యర్థులు గెలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. దీంతో బూత్ స్థాయి నాయకులను, కార్యకర్తలను సైలెంట్ గా పనిలోకి దించేశారు. మరి ఈసారి పోల్ మేనేజ్మెంట్ ఏపీలో ఎవరికి అధికారాన్ని కట్టబెడుతుంది.. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ ఇస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications