పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇక ఫ్రెండ్స్!: లంచ్‌కి పిలిచారు
హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌లను మంచి స్నేహితులను చేశాయి! ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి జోరుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు సీమాంధ్రలోను పవన్ విస్తృతంగా పర్యటించారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలుపు పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వంద సీట్లకు పైగా తాము గెలుస్తామని ఢంకా బజాయిస్తున్నారు. అయితే, ఈ గెలుపులో వారు పవన్ కళ్యాణ్‌కు కూడా షేర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం కారణంగా పలు ప్రాంతాల్లో యువత తమ వైపు మొగ్గిందని వారు విశ్వసిస్తున్నారు. పవన్ ప్రచారం తమకు బాగా మేలు చేసిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా బుధవారం సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ ముగియగానే పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ ప్రచారం వల్ల ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా, ఎస్పీఎస్ నెల్లూరు, రాయలసీమ తదితర దాదాపు అన్ని జిల్లాల్లో టిడిపి వైపు ప్రజలు మొగ్గు చూపారని భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్‌ను తన ఇంటికి విందుకు ఆహ్వానించినట్లగా సమాచారం. మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటికి లంచ్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications