మళ్లీ, నీటి గొడవ: 'పాలమూరు'కు అనుమతుల్లేవ్: దేవినేని
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం వచ్చిపడింది. కృష్ణా జలాల వినియోగం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నాడు కేంద్రానికి లేఖ రాసింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులకు అనుమతులు లేవని ఆయన చెప్పారు. ఆ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. వాటికి సీడబ్ల్యూసీ అనుమతులు లేవన్నారు.

ఇప్పటికే ఉన్న అలమట్టీ వివాదం పైన మూడు రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాయని చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల ఎస్ఎల్‌పీ పిటిషన్ల పైన వాదనలు నడుస్తూనే ఉన్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం పట్టిసీమ అన్నారు. పోలవరం పూర్తయితే పట్టిసీమను టెర్మినేట్ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications