రూ.73 విలువైన ఆహారం 5కే, అన్న క్యాంటీన్లు ప్రారంభం, అక్కడే సీఎం భోజనం
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ప్రారంభం అనంతరం ఆయన అందరితో కలిసి భోజనం చేశారు. తొలి విడతలో 25 మున్సిపాలిటీలలో 60 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే టిఫిన్, భోజనం పెడతారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తారు. రూ.73 విలువైన ఆహారాన్ని రూ.15కే అందిస్తున్నారు.

అక్షయపాత్ర సంస్థకు కేటరింగ్ బాథ్యతలు అప్పగించారు. ప్రతి క్యాంటీన్ ద్వారా రోజుకు 250 నుంచి 300 మందికి సరిపడా ఉంటుంది. అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మందికి అందంచేలా చర్యలు తీసుకున్నారు. టెక్నాలజీ వినియోగంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ ఉంటుంది.












Click it and Unblock the Notifications