హోదాపై మాట్లాడను, కానీ: వెంకయ్య, తెలంగాణ-సీమ ప్రజలపై సుభాషణ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయదలుచుకోలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు చెప్పారు. హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో చర్చకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని, పార్లమెంటులో ఏ విషయం పైన అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక హోదా గురించి తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయదల్చుకోలేదన్నారు.
అది భావోద్వేగాలతో కూడిన అంశమన్నారు. వెనుకబడిన రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
తగిన కసరత్తు లేకుండానే విభజన జరిగిందని, అందుకే ఏపీకి నష్టం జరిగిందని చెప్పారు. ఏపీకి న్యాయం చేయాల్సి ఉందని, ఈ విషయమై తాను ఆర్థిక, హోంశాఖా మంత్రులకు ఎఫ్పటికప్పుడు గుర్తు చేస్తున్నానని చెప్పారు.

మైత్రిని కోరుతారు: జస్టిస్ సుభాషణ్ రెడ్డి
తెలంగాణ, రాయలసీమ ప్రజలు వాడుక భాషలో కేవలం యాస మాత్రమే తేడా ఉంటుందని, ఆచార వ్యవహారాలు అన్నీ ఒకటేనని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఆదివారం అన్నారు. అందుకే తెలంగాణష రాయలసీమ ప్రజలు మైత్రిని కోరుకుంటారని చెప్పారు.
రాయలసీమ సంస్కృతి సంప్రదాయాలు, కళలు, సమస్యల పైన గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆదివారం సికింద్రాబాదులోని హరిహర కళాభావన్లో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడారు.












Click it and Unblock the Notifications