'ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు'
గుంటూరు: తాను మద్దతిచ్చిన పార్టీలు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు అంశాల పైన విపక్షాలు, ఇతరులు ఆయనను నిలదీస్తున్నారు.
ప్రత్యేక హోదా, ఓటుకు నోటు, ఏపీ రాజధాని అమరావతి భూములు... తదితర అంశాల పైన విపక్షాలు, ఇతరులు ఆయనను నిలదీశాయి. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ అంశాల పైన ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు.
ఒకటి రెండుసార్లు బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ వాటి పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సామాజిక అనుసంధాన వేదిక ద్వారా పలుమార్లు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించారు. తాజాగా గుంటూరు బజరంగ్ మిల్ కార్మికులు... పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు.

ప్రశ్నించడం కోసమే వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని బజరంగ్ మిల్ కార్మికులు అంటున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాధానం చెప్పవలసిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని అన్నారు. ప్రభుత్వం దీని పైన స్పందించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని చెబుతున్నారు. దీని పైన పవన్ కళ్యాణ్ వెంటనే స్పందంచాలని కార్మికులు కోరారు.












Click it and Unblock the Notifications