వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీస్టార్లు, నాయకుల వల్లే నిరర్ధక ఆస్తులు: ఆంధ్రాబ్యాంక్ సిఎండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సిఎండి సివిఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం(క్యూ3) ఫలితాలను ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించకపోతే.. ఆ బంగారాన్ని వేలం వేస్తామని ఆంధ్రాబ్యాంకు సిఎండి రాజేంద్రన్ తెలిపారు.

బ్యాంకింగ్ రంగంలోకి ఎస్‌కెఎస్

హైదరాబాద్‌: సూక్ష్మ రుణ సంస్థ ఎస్‌కెఎస్‌ మైక్రోఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్న బ్యాంకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో చిన్న బ్యాంకు ఏర్పాటు కోసం దరఖాస్తు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఎస్‌కెఎస్‌ తెలిపింది.

npas increasing due to cine stars and leaders says andhra bank cmd

ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ ఎజెండాలో భాగంగా కార్యకలాపాలను విస్తరించాలన్న ఉద్దేశంతో బ్యాంకింగ్‌ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ఎస్‌కెఎస్‌ ప్రెసిడెంట్‌ దిల్లీ రాజ్‌ తెలిపారు. ప్రస్తుతం ఎస్‌కెఎస్‌ నెట్‌వర్త్‌ 1,000 కోట్ల రూపాయలుండగా ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం చిన్న బ్యాంకు ఏర్పాటుకు 100 కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ ఉంటే సరిపోతుందని అయన అన్నారు.

బ్యాంకింగ్‌ లైసెన్సుల దరఖాస్తులకు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7నాటికల్లా ఆర్‌బిఐకి బ్యాంకింగ్‌ లైసెన్సును సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు దిల్లీ రాజ్‌ తెలిపారు. కాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఎస్‌కెఎస్‌ మైక్రో నికర లాభం ఏకంగా 91 శాతం వృద్ధి చెంది 41.05 కోట్ల రూపాయలకు చేరుకుంది.

English summary
Andhra Bank CMD Rajendran said that npas are increasing due to cine stars and leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X