Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం అభ్యర్థిగా జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దోస్తీ: లోకేష్‌కు అట్లాంటాలో ఊహించని షాక్

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అట్లాంటాలో ఊహించని షాక్ తగిలింది! తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని ఓ ఎన్నారై సూచించారు. తెలంగాణలో టీడీపీ బలపడాలంటే అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు.

లోకేష్ అట్లాంటాలో ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి, సంక్షేం పథకాలు, టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులపై పలువురు ఆయనకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన నవీన్ అనే ప్రవాసాంద్రుడు పై ఆసక్తికర సూచన చేశారు.

నవీన్ సలహాతో కేరింత

నవీన్ సలహాతో కేరింత

తెలంగాణలో టీడీపీ బలపడాలంటే జూ ఎన్టీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. జూనియర్‌కు బాధ్యతలు అప్పగించి 2019 ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. నవీన్ ఆ సలహా ఇవ్వడంతో అక్కడి వారు కేరింతలు కొట్టారు. చప్పట్లతో మద్దతు పలికారు.

తెలంగాణ సీఎం అభ్యర్థిగా జూనియర్, పవన్‌తో వెళ్లండి

తెలంగాణ సీఎం అభ్యర్థిగా జూనియర్, పవన్‌తో వెళ్లండి

చంద్రబాబుతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా జూనియర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కనీసం 30 సీట్లు అయినా టీడీపీ గెలుచుకునే అవకాశముందని ఆయన సూచించారు. 2019లో బీజేపీతో పొత్తు వద్దని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలుపుకొని వెళ్లాలని కూడా సూచించారు.

సింహం గురించి.. ముద్దుల మావయ్య

సింహం గురించి.. ముద్దుల మావయ్య

బాలకృష్ణ గురించి మాట్లాడాలని కొందరు అభిమానులు నినాదాలు చేశారు. జై బాలయ్య.. జై బాలయ్య అంటూ గట్టిగా అన్నారు. సింహం గురించి నేనేం చెప్పాలని, ఒక నరసింహనాయుడు, ఒక సమరసింహా రెడ్డి, ఒక సింహా, ఒక లెజెండ్ అన్నారు. మీ అందరికీ బాలయ్య అని, తనకు ముద్దుల మావయ్య అన్నారు.

నామరూపాల్లేకుండా పోయిన జగన్ పార్టీ

నామరూపాల్లేకుండా పోయిన జగన్ పార్టీ

చంద్రబాబు ప్రభుత్వం గురించి లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో తొమ్మిది నెలల్లో రెండు నదులను అనుసంధానం చేసి చూపిన ఘనత చంద్రబాబుది అని లోకేష్ అన్నారు. 2019 నాటికి పోలవరం ద్వారా నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలు మెచ్చుకుంటున్నరని చెప్పేందుకు గత ఏడాది జరిగిన నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్పిపల్ ఎన్నికలే నిదర్శనం అన్నారు. జగన్ పార్టీ వైసీపీ నామరూపాల్లేకుండా పోయిందన్నారు.

ఫ్యాన్ మాడిపోయింది, ప్రతి సంక్రాంతికి వచ్చి

ఫ్యాన్ మాడిపోయింది, ప్రతి సంక్రాంతికి వచ్చి


చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందని లోకేష్ అన్నారు. తనకు అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. నంద్యాల, కాకినాడలలో ఫ్యాన్ (వైసీపీ గుర్తు) మాడి మసి అయిందన్నారు. 2019లో టిడిపికి భారీ మెజార్టీ ఖాయమని చెప్పారు. ఏపీలో జరిగే అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని, ప్రతి సంక్రాంతికి వచ్చి టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలకు మద్దతివ్వాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+