ఒళ్లో దేవాన్ష్, బాబు మురిపెం: నాడు లోకేష్-బ్రాహ్మణిలతో ఎన్టీఆర్ (పిక్చర్స్)
చిత్తూరు: కొన్ని సంఘటనలు మధురంగా ఉంటాయి. మనసుని మురిపిస్తాయి. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తన మనవళ్లకు అన్నప్రాసనతో మురిసిపోతే, నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన మనవడు (దేనాన్ష్) అన్నప్రాసనతో మురిసిపోయాడు.
నాడు తన మనవరాలు బ్రాహ్మిణికి (బాలకృష్ణ కూతురు, లోకేష్ భార్య) తిరుమలలో అన్నప్రాసన చేశారు. మనవరాలిని ఒళ్లో కూర్చుండబెట్టుకొని ఎన్టీఆర్ అన్నప్రాసన చేశారు. మరోసారి తన మనవడు నారా లోకేష్ (చంద్రబాబు తనయుడు)కు అన్నప్రాసన చేశారు. లోకేష్ అన్నప్రాసన హైదరాబాదులో జరిగింది.

నాడు ఎన్టీఆర్ తన ఒళ్లో కూర్చుండబెట్టుకొని అన్నప్రాసన చేసిన లోకేష్, బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ అన్న ప్రాసన వేడుక నేడు (ఆదివారం) జరిగింది. చంద్రబాబు తన ఒళ్లో దేవాన్ష్‌ను కూర్చోబెట్టుకొని అన్నప్రాసన చేశారు. మంత్రోచ్ఛరణాల మధ్య స్వామివారి ప్రసాదాన్ని తినిపించారు.

స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పొంగలిని, బంగారు ఉంగరంతో దేవాన్షన్ నోటికి అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, పలువురు పూజారులు, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ దంపతులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నప్రాసన అనంతరం వారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications