కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
కాలిఫోర్నియాలోని తెలుగు సంఘాల వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు మాట్లాడుతూ నాలాంటి ఎన్నో లక్షల మందికి రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్‌నని కొనియాడారు.
లాస్ ఏంజిల్స్‌లో తెలుగు సంఘం నాట్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. లాస్ ఏంజిల్స్‌లోని నాట్స్ ముగింపు సంబరాలకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు ఏపీ మంత్రులు పాల్గొన్నారు.

వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 29న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. జులై 1న వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన అమెరికా, భారత్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుదారుల సమావేశానికి హాజరయ్యారు.
జులై 3న డెట్రాయిట్‌లో తానా వార్షికోత్సవాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. డెట్రాయిట్‌లో తానా అందించినజీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.












Click it and Unblock the Notifications