గాలికి ఎదరుగాలి వీచింది ఇలా: నాడు హీరో, నేడు ?
అనంతపురం: గాలి జనార్దన్ రెడ్డిని కొన్ని రాజకీయ శక్తులు టార్గెట్ చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారిగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంలో కీలకపాత్ర పోషించిన గాలి జనార్దన్ రెడ్డిని ఇరుకున పెట్టారని అంటున్నారు.

పనిలో పనిగా మైనింగ్ కింగ్ గా ఉన్న గాలిని అదే మైనింగ్ స్కాం కేసులో అరెస్టు చేశారని ఆయన అనుచరులు అంటున్నారు. దెబ్బకు దెబ్బతోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించిన ప్రత్యర్థులు, మైనింగ్ కంపెనీ వ్యాపారులు చివరికి అదే అస్త్రం ఉపయోగించారు.
ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ యజమాని అయిన గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో అనేక మంది నాయకులు రాజకీయాలకు అతీతంగా గాలి దగ్గర ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో చక్రం తిప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు దిమ్మతిరిగే విధంగా వ్యవహరించారు. కర్ణాటకలో మొదటి సారి పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించారని వెలుగు చూసింది.
అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడంతో కొందరు జీర్ణించుకోలేకపోయారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వం మీద ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తీసుకు వచ్చేలా చేశారు.
అప్పటి వరకు అండగా ఉన్న ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఆకస్మిక మరణంతో గాలి జనార్దన్ రెడ్డికి కష్టాలు మొదలైనాయి. ఎలాగైనా గాలి జనార్ధన్ రెడ్డిని దెబ్బకొట్టాలని అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో ఆయన పెత్తనం చేస్తున్నారని, ఇక్కడి మైనింగ్ వ్యాపారులకు నిద్రలేకుండా చేస్తున్నారని ఓ వర్గం గాలి మీద రగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రతిపక్షాలు సైతం గాలి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి.
ఇటు ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేశాయి. కర్ణాటకలోని సొంత పార్టీ నాయకులైన బీజేపీ నేతలు సైతం గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా పావులుకదిపారు. అన్ని వైపుల నుంచి గాలికి ఎదురుగాలే వీచింది.

కాలం కలిసిరాకపోవడంతో గాలి మీద వచ్చిన ఆరోపణలు అన్నింటి మీద కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు వ్యాపారులు మని చెప్పి బళ్లారిలో లాడ్జ్ అద్దెకు తీసుకుని గాలి దినచర్యల మీద నిఘా వేశారు.
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో ఉన్న సమయంలో వేకువ జామున ఆయన ఇంటి మీద దాడి చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇంటిలోని బంగారు నగలు, విలువైన వస్తువులు, నగదు, ఆస్తుల పత్రాలు, ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు.
గాలిని వలవేసి పట్టుకున్న సీబీఐ అధికారులు ఆయన ఇంటిలో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. గాలి అనుచరుల ఇళ్లలో సోదాలు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
గాలితో పాటు ఆయన అనుచరులను అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ. లక్ష్మినారాయణ నేతృత్వంలోని బృందం 2011అక్టోబర్ 14న అరెస్టు చేసింది. అదే రోజు గట్టి బందోబస్తుతో రోడ్డు మార్గంలో గాలిని హైదరాబాద్ తీసుకు వెళ్లారు. దాదాపు మూడేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి గత సంవత్సరం బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులను చెరిపివేసి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల పోలీసులు కాకుండా సీబీఐ రంగంలోకి దిగడంతో గాలి అరెస్టు అయ్యారు.
గాలి మీద సీబీఐతో పాటు కర్ణాటక లోకాయుక్తలో కేసులు నమోదు అయ్యాయి. అక్రమంగా ఇనుప ఖనిజం పోర్టుకు తరలించి కొన్ని వేల టన్నుల సరుకు విదేశాలకు ఎగుమతి చేశారని సిట్ కేసులు నమోదు చేసింది.
మా నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి మీద నమోదు అయిన కేసుల నుంచి ఆయనకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని గాలి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గాలి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications