జగన్ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీతకు అభ్యంతరకర సందేశాలు

ఇదిలా ఉండగా.. బాబును కలిసిన అనంతరం తనకు మానసిక వేధింపులు ఆరంభమయ్యాయని ఆమె అరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అరకులో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని అరకు సమస్యలపై కలిసిన అనంతరం తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయన్నారు.
తాను కాక మరెవరైనా ఫోన్ అటెండ్ చేస్తే కనుక మౌనమే సమాధానం అవుతోందన్నారు. అలాగే తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అసభ్యకరమైన సందేశాలు పోస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications