ఏపీ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు-మారువేషాల్లో వచ్చి-సర్కారీ సేవలపై ఆరా
ఏపీలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజల్లో మాత్రం అసంతృప్తి పెరుగుతోందనే నివేదికల నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ సచివాలయాలతో పాటు ప్రభుత్వ సేవలు అందే ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండే వారికి మెమోలు కూడా ఇస్తామని హెచ్చరించారు. దీంతో ఇావాళ రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మారువేషాల్లో వెళ్లి మరీ సచివాలయాలు, ఎరువుల షాపుల్లో అందుతున్న సేవలపై వివరాలు తీసుకున్నారు.
చిత్తూరులోని 36వ డివిజన్ సచివాలయానికి డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అయితే నేరుగా తనిఖీలకు వెళ్తే సరైన సమాచారం రాదని తెలుసుకుని, గృహనిర్మాణ లబ్దిదారుగా వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగారు. దీంతో వారు నీళ్లు నమిలారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కాసేపు ఆగి తాను డిప్యూటీ కలెక్టర్ అన్న విషయాన్ని బయటపెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది అడ్డంగా బుక్కయ్యారు. సచివాలయంలో సేవలు అందించే విధానం ఇదేనా అంటూ డిప్యూటీ కలెక్టర్ పల్లవి సిబ్బందికి చీవాట్లు పెట్టారు.

మరోవైపు విజయవాడలో సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ కూడా సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపుకు వెళ్లారు. ఎరువులు కావాలని దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా లేవని యజమాని చెప్పాడు. దీంతో మరో షాపుకు వెళ్లి అక్కడ ఎరువులపై ఆయన ఆరా తీశారు. దీంతో సబ్ కలెక్టర్ కు ఎరువులు ఇచ్చి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేశాడు. వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు.

ఆ తర్వాత ఒక్కో అధికారికీ ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించిన సబ్ కలెక్టర్... రెండు షాపుల్నీ సీజ్ చేయించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్.. అక్కడ షాపు మూసేసి ఉండటంతో రైతుల్ని వాకబు చేశారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారని వారు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు ఇఛ్చారు.
ఏపీ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు-మారువేషాల్లో వచ్చి-సర్కారీ సేవలపై ఆరా#andhrapradesh, #villagesecretariat pic.twitter.com/0RiORvsA3R
— oneindiatelugu (@oneindiatelugu) August 7, 2021
Recommended Video
ఏపీ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు-మారువేషాల్లో వచ్చి-సర్కారీ సేవలపై ఆరా#andhrapradesh, #villagesecretariat pic.twitter.com/bpJBBQADKo
— oneindiatelugu (@oneindiatelugu) August 7, 2021
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications