పీఎం కిసాన్‌ – రైతు భరోసా నిధుల జమపై కీలక ప్రకటన..!!

పీఎం కిసాన్‌ - డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా లబ్దిదారులకు అధికారులు కీలక ప్రకటన చేసారు. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రూ 2 వేల చొప్పున రూ 6వేల సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ 7,500 కలిపి మొత్తం రూ 13,500 అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన నాలుగున్న ఏళ్ళుగా 15 విడతలుగా సాయం అందించగా 16వ విడత సాయాన్ని త్వరలోనే అందించనున్నారు.

నిర్దేశిత నిబంధనల మేరకు ఈక్రాప్‌ తో పాటు- ఈ కేవైసీ పూర్తి చేసుకన్న రైతులకే పథకం వర్తిస్తోంది. 16వ విడత సాయం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈనెల 22 లోపు రైతులంతా ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ వెల్లడించింది. రైతు భరోసా కేంద్రాల వారీగా ఈనెల 11 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 22 లోపు ప్రతి రైతు ఈ క్రాప్‌, ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీకేల్లోని వ్యవసాయశాఖ సహాయకులు ఈ క్రాప్‌, ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం రైతులకు సహకారం అందిస్తున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది.

Officials alerts YSR Bharosa - PM kisan beneficiares to complete E KYC before 22nd

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన నాలుగున్న ఏళ్ళుగా 15 విడతలుగా సాయం అందించగా 16వ విడత సాయాన్ని త్వరలోనే అందించనున్నారు. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి- మార్చి మధ్య ఈ విడత సాయం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇకేవైసీ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఇకేవైసీ అందుబాటులో ఉంది. లేదా సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ ఆధారిక కేవైసీ పూర్తి చేయవచ్చని అధికారులు సూచించారు. వచ్చే నెల తొలి వారంలో 16వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+