వంశీకి జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ - సీసీ కెమేరాల్లో దొరికేసారు..!!

వల్లభనేని వంశీ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్.. బెది రింపుల కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించటంతో విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న వంశీ బ్యారక్ వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా చె బుతున్నారు. ఇక..సత్యవర్ధన్ అరెస్ట్ - బెదిరింపుల వ్యవహారంలో సీసీ కెమేరాల్లో పూర్తి ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం. వంశీ పైన పెండింగ్ లో ఉన్న ఇతర కేసుల్లోనూ విచారణకు పోలీ సులు సిద్దం అవుతున్నారు.

వంశీ బ్యారక్ వద్ద
వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా వంశీ బ్యారక్ కు అధికారులు పరదాలు కట్టినట్లు సమాచారం. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించి, కేసు నుంచి తప్పుకొనేలా చేశారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా, కోర్టు రిమాండ్ విధించటంతో జైల్లో ఆయనకు ఒకటో నెంబర్ బ్యారక్ గదిని కేటాయించారు. వంశీ జైల్లోని ఇతర ఖైదీలకు కనిపించకుండా పరదాలు కట్టినట్లు తెలుస్తోంది. అదే విధంగా వంశీ బ్యారక్ వైపు ఖైదీలు ఎవరూ వెళ్లకుండా భద్రతా ఏర్పాటు చేసి.. సీసీ కెమేరాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

Officials special measures for Vallabhaneni Vamsi security in Vijayawada jail

సీసీ కెమేరాల్లో నిక్షిప్తం
వంశీ కేసులో ఈ రోజు (సోమవారం) సత్యవర్ధన్ ను న్యాయాధికారి ముందు ప్రవేశ పెట్టాలని పోలీసు లు భావిస్తున్నారు. వంశీ, ఆయన మద్దతు దారులు తనను బెదిరించి కిడ్నాప్‌ చేశారని.. గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో సంబంధం లేదని బలవంతంగా చెప్పించారని సత్యవర్ధన్‌ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఇదే వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో వంశీ అరెస్ట్ కు ముందే పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించినట్లు తెలు స్తోంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి తీసుకురావటం.. అక్కడ నుంచి కారులో విశాఖ తరలింపు.. కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో ఉండటంతో.. వాటిని పోలీసులు సేకరించారు.

ఇతర కేసుల్లోనూ
తన భర్త వంశీకి ప్రాణహాని ఉందని ఆయన సతీమణి చెప్పటంతో జైలు అధికారులు బ్యారక్ వద్ద భద్రత పెంచారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్య వర్ధన్ ను వంశీ, అనుచరులు కిడ్నాప్.. బెదిరింపులు..వారి ఆగడాల సీసీ కెమెరాల దృశ్యాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో వంశీ పైన గతంలో పలు వివాదాల్లో నమోదు అయిన కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటిల్లోనూ విచారణ కోసం పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. కాగా, రేపు (మంగళవారం) మాజీ సీఎం జగన్ జైల్లో వంశీని పరామర్శించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+